District collector : ఎంత ధాన్యం కొన్నారు.. ఐకెపి కేంద్రం ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..!
District collector : ఎంత ధాన్యం కొన్నారు.. ఐకెపి కేంద్రం ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
రైతులు నాణ్యమైన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో తిసుకునివచ్చి విక్రయించుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం కొల్లంపల్లి, ధన్వాడలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.
కొల్లంపల్లిలో ఐకెపి ఆధ్వర్యంలో నడుస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి రైతులకు సన్న వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని అన్నారు. అనంతరం ధన్వాడ సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి ఇంతవరకు ఎంతమంది రైతులు కొనుగోలు కేంద్రానికి వరి ధాన్యం తెచ్చారని అడిగీ తెలుసుకున్నారు.
వరి ధాన్యం కనీస మద్దతు ధర ఏ గ్రేడ్ రూ.2,320 బి గ్రేడ్ రూ.2,300 కు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించుకోవాలని మధ్య దళారీలను ఆశ్రయించవద్దని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
-
TG News : కుటుంబ సర్వే పై అపోహలు సృష్టించే ప్రయత్నం.. సంక్షేమ పథకాలు పోతాయని దుష్ప్రచారం..!
-
Gold Price : పసిడి పండింది.. మొదటి షాక్, 2024 నవంబర్ 6న బంగారం ధర..!
-
Viral Video : బాలయ్య బాబు స్టెప్పులకు టీచర్ ఫిజిక్స్ పాఠాలు.. ఇలా కూడా చెప్పొచ్చు (వీడియో)
-
Gold Price : ట్రంప్ గెలుపు.. భారీగా పతనమైన పసిడి.. ఒకే రోజు రూ.17,900 తగ్గిన ధర..!









