Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

District collector : నీతి అయోగ్ ద్వారా సాధించిన ప్రగతి పై జిల్లా కలెక్టర్ సమీక్ష..!

District collector : నీతి అయోగ్ ద్వారా సాధించిన ప్రగతి పై జిల్లా కలెక్టర్ సమీక్ష..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ నెల 26 న జిల్లాలోని నర్వ మండలంలో పర్యటిస్తున్న సందర్భంగా జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ విద్యా, వైద్య, సంక్షేమ, వ్యవసాయ, భూగర్భ జల శాఖ అధికారులతో సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ నీతి అయోగ్ సూచించిన రంగాలలో ఇప్పటి వరకు సాధించిన ప్రగతి గురించి ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. శాఖల వారీగా అన్ని నివేదికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.

ముఖ్యంగా సంపూర్ణత అభియాన్ కార్యక్రమాల అమలు తీరు పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సమీక్షిస్తారని, అధికారులు ప్రగతి నివేదికలను తయారు చేసుకుని సిద్ధంగా ఉండాలన్నారు. విద్య, వైద్య, సంక్షేమ శాఖల పనితీరు సంతృప్తి పరంగా ఉన్నా, వ్యవసాయ శాఖ చేపట్టాల్సిన మట్టి నమూనాల సేకరణ ఎందుకు జరగలేదని కలెక్టర్
డి ఏ ఓ జాన్ సుధాకర్ ను ప్రశ్నించారు.

స్పందించిన డీ ఎ వో ప్రస్తుతం రైతులు పొలాల్లో పంటలు వేశారని, మట్టి నమూనాలను సేకరించడం సాధ్యం కాదని తెలిపారు. దీనిపై క్లారిటీతో ఉండాలని కలెక్టర్ డి ఏ ఓ కు సూచించారు. సమీక్షలో ట్రైనీ కలెక్టర్ గరీమా నరుల, డిఆర్డిఓ మొగులప్ప, డీపిఓ కృష్ణ, డిఇఓ గోవిందరాజులు, భూ గర్భజల శాఖ అధికారిని రమాదేవి, జిల్లా వైద్యాధిక శాఖ అధికారిని డాక్టర్ సౌభాగ్య లక్ష్మి, డాక్టర్ శైలజ, జి సి డి ఓ పద్మనలిని, డి డబ్ల్యు ఓ జయ, నర్వ ఎంపీడీఓ, సిడిపిఓలు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు