District collector : ప్రజావాణి, ప్రజా దర్బార్ కు వచ్చిన దరఖాస్తులను నిర్లక్ష్యం చేయవద్దు.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
District collector : ప్రజావాణి, ప్రజా దర్బార్ కు వచ్చిన దరఖాస్తులను నిర్లక్ష్యం చేయవద్దు.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని ప్రజావాణి సమావేశ మందిరం లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి కలెక్టర్ సిక్త పట్నాయక్ దరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజావాణి, ప్రజాదర్బార్ కు సంబంధించిన దరఖాస్తులను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పరిష్కరించాలని పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మొత్తం 21 దరఖాస్తులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు.
కొన్ని దరఖాస్తులను సంబంధిత అధికారులకు సమావేశ మందిరంలోనే అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్ శాలం,ఆర్డీవో రామచందర్, ఏవో జయసుధ ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Gold Price : రెండు రోజుల్లో పసిడి ధరలు.. ఈరోజు తులం ధర ఎంతంటే..!
-
Pass Book : రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు.. ప్రతి యజమానికి భూధార్ నెంబర్..!
-
UPI : గూగుల్ పే ఫోన్ పే వాడుతున్నారా.. అయితే జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై మంత్రి తుమ్మల క్లారిటీ.. ఒక్క రైతును కూడా తగ్గించం.. లేటెస్ట్ అప్డేట్..!









