మిర్యాలగూడ : వచ్చే ఎన్నికల్లో బిజెపిని ఓడించాలి

వచ్చే ఎన్నికల్లో బిజెపిని ఓడించాలి

మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఏడు దశల్లో పోరాటాలు
సంక్షేమం, అభివృద్ధిలో కేరళ అగ్రస్థానం
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి ఎన్. చంద్రన్

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూరుస్తూ పేద ప్రజలపై భారాల మోపుతున్న బిజెపి ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి ఎన్. చంద్రన్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆ సంఘం ప్రతినిధుల బృందంతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 18, 19 తేదీలలో నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ లో అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం కమిటీ సమావేశాలు నిర్వహించామని దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో వ్యవసాయ కార్మిక సంఘం చేస్తున్న ఉద్యమాలపై సుదీర్ఘంగా చర్చించామన్నారు.

 

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు భవిష్యత్తు ఉద్యమాల కార్యచరణ రూపొందించినట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నాటికి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను గ్రామీణ ప్రాంత ప్రజలకు వివరించి చైతన్యపరిచేందుకు ఏడు దశల్లో ఉద్యమాలు చేయాలని సమావేశాల్లో నిర్ణయించినట్లు తెలిపారు.

 

దళితుల సమస్యలపై దేశవ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తామన్నారు ఆగస్టు 26, 27 తేదీల్లో దళిత సమస్యలపై జాతీయస్థాయిలో హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఉద్యమం చేపడుతున్నట్లు తెలిపారు. దీనికోసం దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి దళితులను పెద్ద ఎత్తున సమీకరించనున్నట్లు తెలిపారు.

 

> ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి..👇

1. TSRTC : ప్రైవేట్ ట్రావెల్స్ కు దీటుగా తెలంగాణ ఆర్టీసీ టూర్ ప్యాకేజీ.. 22 నుంచి ప్రారంభం..!

2. WhatsApp Tips : మీ వాట్సాప్ లో మెసేజ్ మీకు తెలియకుండా ఎవరైనా చదువుతున్నారా..? తెలుసుకోండి ఇలా..!

3. కెసిఆర్ ప్రభుత్వం పై మావోయిస్టుల కీలక లేఖ విడుదల..!

4. మిర్యాలగూడ : నాగార్జునసాగర్ జలాశయంలో సాగుకు నీరుందా..? ఎడమ కాలువకు నీటి విడుదల ఎప్పుడో..?

 

ప్రజా పంపిణీ వ్యవస్థను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బలోపేతం చేయాలని పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించి పేదలకు సబ్సిడీలు పెంచి ఇవ్వాలన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసినందుకు గ్రామీణ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు సేవ్ ఇండియా పేరుతో ఆగస్టు 14న సాయంత్రం ఐదు గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు ఫ్రీడం విజిట్ పేరుతో దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

 

ఈ ఆందోళనలో ప్రజాస్వామ్యం అపహాస్యం ఎలా అవుతుందో ప్రజలకు వివరించి చైతన్య పరచాలని కోరారు. మానవ హక్కుల పరిరక్షణతో పాటు అనేక సమస్యలపై డిసెంబర్ నెలలో ఉద్యమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. 18 రాష్ట్రాలలో 270 జిల్లాలలో వ్యవసాయ కార్మిక సంఘం పనిచేస్తుందని తెలిపారు. రెండోసారి కేరళలో వామపక్ష పార్టీలు అధికారం రావడంతో అనేక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందన్నారు.

 

మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ కూలీలకు కూలి రేట్లు పెంచాలని, కనీస వేతనం అమలు అయ్యేవిధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతాంగ, కార్మిక సమస్యలపై భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు.

 

> ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి..👇

1. WhatsApp Tips : మీ వాట్సాప్ లో మెసేజ్ మీకు తెలియకుండా ఎవరైనా చదువుతున్నారా..? తెలుసుకోండి ఇలా..!

2. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్..  హెల్త్ ఇన్సూరెన్స్ రూ.950 లకే రూ. 5 లక్షల బెనిఫిట్..!

3. Eamcet Counseling : తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు.. రిపోర్టు ఎప్పుడు చేయాలో తెలుసుకుందాం..!

 

ఈ సమావేశంలో ఆ సంఘం జాతీయ సహాయ కార్యదర్శి నిర్మద సర్దాస్, ఉపాధ్యక్షులు కోమల కుమారి కేంద్ర కమిటీ సభ్యులు దేవా దర్శనన్, రామకృష్ణ, హిమాన్సుదాస్, నారి ఐలయ్య, లలితా బాలన్, బాన్యటుడు, సుకుమార్ చక్రవర్తి, మింజనూరు రామన్, ఏడి గుంజ అర్చన్, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు భవాండ్ల పాండు, అవుతా సైదులు, డి వై ఎఫ్ ఐ నాయకులు మల్లం మహేష్, బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు