Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESక్రైంరంగారెడ్డి

రూ.80లక్షల నకిలీ బిటి3 రకం విత్తనాల పట్టివేత

రూ.80లక్షల నకిలీ బిటి3 రకం విత్తనాల పట్టివేత

కర్ణాటకకు చెందిన ముగ్గురు అరెస్ట్

రంగారెడ్డి జిల్లా నందిగామ, జూన్ 21, మనసాక్షి : కర్ణాటక నుండి మంచిర్యాల చెన్నూరుకు బీటీ3 రకం నకిలీ పత్తి విత్తనాలను రవాణా చేస్తున్న కర్ణాటకకు చెందిన ముఠాను సైబరాబాద్ కమిషనర్ పరిధిలో పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. శంషాబాద్ జోన్ ఎస్వోటీ, పోలీసులతో పాటు షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండల పోలీసుల జాయింట్ ఆపరేషన్ ద్వారా రూ. 80 లక్షల విలువైన బిటి3 నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకకు చెందిన పాత నేరస్థుడు ఫణీంద్రపు వెంకటేశ్వరరావుతో పాటు గంగారెడ్డి, పాపిరెడ్డి గారి రమేష్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు మూడు క్వింటాళ్ల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు ఈ విషయాలను వెల్లడించారు.
శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్వోటి నారాయణ పర్యవేక్షణలో వ్యవసాయ శాఖ అధికారి శ్వేత, షాద్ నగర్ ఏసిపి కుశాల్కర్, నందిగామ సీఐ రామయ్య, ఎస్ఓటి సిఐ వెంకట్ రెడ్డి, ఎస్సైలు రవి, రాజేశ్వర్ రెడ్డి సిబ్బంది తదితరులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్లు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ సందర్భంగా మారుతి డిజైర్ కారుతో పాటు కర్ణాటక కు చెందిన ఒక డీసీఎం వ్యాన్, నాలుగు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందితో పాటు ఎస్వోటీ సిబ్బందిని కమిషనర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటి సిబ్బంది సత్యం తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

1. Real hero : దుండగుడితో ఎస్సై వీరోచిత పోరు (వీడియో వైరల్)

2. నల్గొండ లో తీవ్ర విషాదం : రైలు ఢీకొని తల్లి, ఇద్దరు చిన్నారుల మృతి – latest news

÷. అయ్యయ్యో.. అమెరికా అధ్యక్షుడికి అలా జరిగిందే (వీడియో)

మరిన్ని వార్తలు