ఎరువుల షాపులను తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి..!

మంగపేట మండలం దోమెడ గ్రామంలోని వ్యవసాయ పంట పొలలాను జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర మంగపేట వ్యవసాయ అధికారి చేరాలు ఈఇఓ మహేష్ తో కలసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.

ఎరువుల షాపులను తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి..!

మంగపేట, మన సాక్షి ప్రతినిధి :

ములుగు జిల్లా మంగపేట మండలం దోమెడ గ్రామంలోని వ్యవసాయ పంట పొలలాను జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర మంగపేట వ్యవసాయ అధికారి చేరాలు ఈఇఓ మహేష్ తో కలసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. వరి పంట లో వచ్చు చీడపీడల మీద సమగ్ర సస్యరక్షణ చేపట్టాలని తెలిపారు.

రాజుపేట ఎరువుల షాపుల్లో తనిఖీలు చేపట్టారు ఎరువులు పురుగు మందుల రిజిస్టర్లు గోడౌన్స్ తనిఖీ చేసి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి చేరాలు, వ్యవసాయ విస్తరణ అధికారి మహేష్, ఎరువుల డీలర్ల అధ్యక్షుడు చంద్రశేఖర్, రైతులు పాల్గొన్నారు.

ALSO READ : Record break : గత రికార్డు బ్రేక్ చేసిన రేవంత్ సర్కార్..!