Fire : అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం..!

మంగపేట మండలంలోని నరసింహాసాగర్ పంచాయతీ, శనికుంటలో పెద్దల రజిత దేవేందర్, చెందిన ఇల్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగ కాలిపోయింది.

Fire : అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం..!

మంగపేట, మన సాక్షి ప్రతినిధి :

మంగపేట మండలంలోని నరసింహాసాగర్ పంచాయతీ, శనికుంటలో పెద్దల రజిత దేవేందర్, చెందిన ఇల్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగ కాలిపోయింది. ఈ ఘటనలో ఇంట్లోని వస్తువులు, నిత్యావసరాలు, ధాన్యం, బీరువా వంటి సుమారు రెండు లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.

వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో దేవేందర్, భార్య ఇంటి సమీపంలోని బోరు వద్ద చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడుతుండగానే ఇంటి పైకప్పు నుండి పొగల్ రావడం గమనించామని చూస్తున్నంతలోనే ఇల్లు మొత్తం మంటలు చెలరేగి కాలిపోయినట్లు వారు తెలిపారు.

అగ్ని ప్రమాదానికి కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ మరేదో తెలియదని వారు పేర్కొన్నారు అగ్నిప్రమాదంలో ఇల్లు సర్వం కాలిపోయి నీరాశ్రయులుగా కట్టు బట్టలతో మిగిలిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని దేవేందర్ రజిత, దంపతులు వేడుకున్నారు.

ALSO READ : Telangana : తెలంగాణలో పేదలకు మరో శుభవార్త.. ఇందిరమ్మ ఇండ్లకు ముహూర్తం ఖరారు..!