Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంప్రపంచం

BREAKING: అమెరికాలో కాల్పులు.. తెలుగు యువకుడు మృతి..!

BREAKING: అమెరికాలో కాల్పులు.. తెలుగు యువకుడు మృతి..!

మన సాక్షి , డెస్క్ :

కేవలం సిగరెట్ ప్యాకెట్ కోసం దుండగుడు కాల్పులు జరపడంతో అమెరికాలో తెలుగు యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన అమెరికాలో సెన్సేషనల్ గా మారింది. ఈ విషాద ఘటనలో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం షాక్ గురైంది.అమెరికాలోని డల్లాస్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపికృష్ణ (32) గా గుర్తించారు.

గోపికృష్ణ జీవనోపాధి కోసం ఎనిమిది నెలల క్రితం అమెరికా వెళ్ళాడు. ఎంఎస్ పూర్తి చేసిన గోపికృష్ణ మంచి ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం ఆర్కెన్స్ లోని సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గోపికృష్ణ కౌంటర్ లో ఉండగా దుండగుడు దూసుకొచ్చి కాల్పులు జరపడంతో గోపికృష్ణ రక్తపు మడుగులో కింద పడిపోయాడు డు.

ఆ తర్వాత కౌంటర్ లోకి వచ్చిన దుండగుడు సిగరెట్ ప్యాకెట్ తీసుకొని పారిపోయాడు. అదే స్టోర్ లో పని చేస్తున్నవారు వెంటనే ఆంబులెన్స్ లో గోపిని హాస్పిటల్ తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ ఘటన సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ : 

POSTAL: పోస్టల్ శాఖలో 50వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్, రాత పరీక్ష లేకుండా ఎంపిక..!

HYDERABAD : సంచలనం కలిగించిన బురఖా దొంగలు..కేసు ఛేదించిన సైబరాబాద్ పోలీసులు..!

మరిన్ని వార్తలు