TGSRTC : ఉచిత బస్సు ఎఫెక్ట్.. ఏవీ పల్లె వెలుగులు..!
TGSRTC : ఉచిత బస్సు ఎఫెక్ట్.. ఏవీ పల్లె వెలుగులు..!
కంగ్టి, మన సాక్షి :
పల్లెల్లో ఉచిత బస్సు ఎఫెక్ట్ పడింది. ఉచిత బస్సు మహిళలకు అందజేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పల్లె వెలుగులు రాకుండా పోయాయి.
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తో తడ్కల్, ముర్కుంజాల్, రసోల్ , బాన్సువాడ, జమ్గి కే, జమ్గి బి, గాంధీనగర్, ఘనపూర్, చాప్టా కే,దామరగిద్ద గ్రామాలకు కనిపించని పల్లె వెలుగు బస్సులు పల్లెల్లో నివసించే ప్రజల రవాణా సౌకర్యం కోసం పల్లె వెలుగు బస్సులు నడిచేవి. రాష్ట్ర ప్రభుత్వం పల్లె వెలుగు పేరుతో ఆర్టీసీ బస్సులను పల్లెల్లో ప్రవేశపెట్టింది.
కానీ అవి ఇప్పుడు కనిపించడం లేదు. కేవలం పట్టణానికి పరిమితం కావడంతో పల్లెల్లో రవాణా అస్తవ్యస్తంగా మారిందని గ్రామీణ విద్యార్థులు, ప్రజలు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిపో మేనేజర్ కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు బస్సు ఫ్రీ ఉపయోగపడడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
ముఖ్యంగా విద్యార్థులకు తడ్కల్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ కు వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రవేట్ ఆటోలు కానీ, బైక్ లపై తీసుకురావడం జరుగుతుంది తల్లిదండ్రులు కోరుతున్నారు.
స్కూల్ సమయానికి కూడా బస్సులో రావడం లేదని ఇతర రాష్ట్రాల బస్సు కర్ణాటక, కామారెడ్డి జిల్లా బాన్సువాడ డిపో బస్సులు వస్తున్నాయి. కానీ ఇంటి బస్సు గా చెప్పు కొనే నారాయణఖేడ్ డిపో బస్సులు రావడం లేదని ఇప్పటికైనా ఉన్నత అధికారులు మరియు స్థానిక నాయకులు స్పందించాలని కోరుతున్నారు.
MOST READ :
-
Forest Jobs : రాత పరీక్ష లేకుండా అటవీ శాఖలో ఉద్యోగాలు.. నెలకు రూ.31 వేల వేతనం..!
-
Jobs : ఉద్యోగులకు శుభవార్త.. టెన్త్ అర్హత ఉంటే చాలు.. కోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం..!
-
Gold Price : పసిడి ధర తగ్గుదలకు బ్రేక్ లేదు.. మరింత తగ్గిన బంగారం ధర..!
-
Gold Price : పసిడి ధర తగ్గుదలకు బ్రేక్ లేదు.. మరింత తగ్గిన బంగారం ధర..!









