స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్రులు

స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్రులు

ఖమ్మం(కూసుమంచి) , అక్టోబర్ 7, మనసాక్షి ప్రతినిధికష్టం వస్తె పక్కింటి వాళ్ళు కూడా పట్టించుకోని రోజులు ఇవి . కానీ కలిసి చదువుకున్న స్నేహితులు తోటి మిత్రుడు దురదృష్ట వశాత్తూ చనిపోయాడు . ఆ కుటుంబానికి అండగా నిలిచిన మిత్రులను చూసి పలువురు అభినందిస్తున్నారు .

వివరాలు ఇలా ఉన్నాయి..కూసుమంచి మండలం తురకగూడెం గ్రామానికి చెందిన వసుకుల వీరశేఖర్ రెండు నెలల క్రితం చేపల వేటకు వెళ్ళి మృత్యువాత పడ్డారు. వీరశేఖర్ కు బార్య కూతురు కుమారుడు ఉన్నారు. వీర శేఖర్ మీదనే ఆధారపడి ఉన్న కుటుంబం ఒక్కసారిగా ఆనాధల మారారు. విషయం తెలుసుకున్న తోటి మిత్రులు ఎం. ప్రసాద్, ఎస్.సుధాకర్, జి నరేందర్, ఏ.అనిల్,ఎస్కే పాషా, ఎస్.కె నసీరుద్దీన్ అందరూ కలిసి 50,000 రూపాయలను వీర శేఖర్ కూతురి పేరున ఎస్బిఐ బ్యాంకులో డిపాజిట్ చేశారు. దీంతో తమ కుటుంబానికి అండగా నిలిచిన మిత్రులకు వీర శేఖర్ కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.