గ్యాస్‌ సిలిండర్‌ లీక్.. చెలరేగిన మంటలు..!

గ్యాస్‌ సిలిండర్‌ లీక్.. చెలరేగిన మంటలు..!

తుంగతుర్తి , మనసాక్షి

మండల పరిధిలోని వెంపటి గ్రామంలో గుండగాని నరేష్ ఇంట్లో శుక్రవారం సాయంత్రం గ్యాస్‌ సిలిండర్‌ లీకై మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న ఆయన గ్యాస్‌ సీలిండర్‌ను బయటకు తీసుకువచ్చి మంటలను అర్పివేయడంతో ఘోర ప్రమాదం తప్పింది.

 

స్థానికుల కథనం ప్రకారం.. నరేష్ తల్లి వంట చేసేందుకు గ్యాస్‌ స్టౌవ్‌ను వెలిగించడంతో సీలిండర్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ కావడంతో మంటలు చెలరేగడంతో కేకలు వేసింది..

 

ALSO READ : 

1. Telangana : తెలంగాణ ఎన్నికలకు ముందే ఐడి కార్డు ఉంటే సరిపోదు.. ఓటర్ల జాబితాలో మీ పేరు.. ఉందో? లేదో? ఇలా చూసుకోండి..!

2. Railway Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో 3624 రైల్వే ఉద్యోగాలు..!

3. Flipkart | నిరుద్యోగులకు శుభవార్త.. ఫ్లిప్ కార్ట్ సహకారం.. రూ. 10 లక్షలు సంపాదించే ఛాన్స్..!

 

అక్కడే ఉన్న ఆమె కుమారుడు గ్యాస్‌ సీలిండర్‌ ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చాడు.వెంటనే స్థానికులతో కలిసి నీళ్లు, ఇసుక చల్లుతూ సిలిండర్‌ నుంచి ఎగిరిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చారు. సకాంలంలో మంటలు ఆర్పివేయడంతో ఘోర ప్రమాదం తప్పింది.

 

ఈ ప్రమాదంలో సుమారు లక్ష రూపాయలు ఆస్తి నష్టం జరిగినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.