Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Narayanpet : ముస్లిం మైనారిటీ విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి..!

Narayanpet : ముస్లిం మైనారిటీ విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

ముస్లిం మైనారిటీ విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకోగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ కు మర్యాదపూర్వకముగా కలిసి పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు.

అనంతరం కలెక్టర్ ఆధ్వర్యంలో డీఎస్పీ లింగయ్య, మైనారిటీ అధికారి రషీదుతో ముస్లింమైనారిటీ సంక్షేమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మైనారిటీ వారి సమస్యలపై దిశా నిర్దేశం చేసి పలు సూచనలు చేశారు. సర్వే సిబ్బందికి ముస్లిం మైనారిటీ ప్రజలు సహకరించాలని కోరారు.

ప్రొఫార్మా ద్వారా ముస్లిం మైనార్టీలు పొందే ప్రయోజనాలను వ్యాప్తి చేయాలనీ కోరగా అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. సర్వే విజయవంతం అయితే ప్రభుత్వం విజయవంతం అవుతుందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఈ సర్వే ద్వారా మరింత ప్రయోజనం కలుగుతుందని ఆయన తెలిపారు.

మైనారిటీ వర్గాలవారు సర్వేపట్ల అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలు మైనారిటీ ప్రజలకు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్న జిల్లా కలెక్టర్, డిఎస్పీలను ప్రత్యేకంగా అభినందించారు.

అనంతరం తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంటర్మీడియట్ కళాశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి విద్య బోధన, హాస్టల్ సదుపాయం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. మైనారిటీ సంక్షేమ అధికారి రషీద్, కళాశాల ప్రిన్సిపాల్ జగదీశ్వర్ రెడ్డి తో పాటు, విద్యార్ధులు మరియు సిబ్బందితో సంభాషించారు,

విద్యా వాతావరణం మరియు వనరులను మెరుగుపరిచే మార్గాల గురించి చర్చించారు. తల్లిదండ్రులు, గురువులు చెప్పిన విషయాలను పాటిస్తూ ఉన్నత అవకాశాలను అందుకోవాలని విద్యార్థులకు తెలియజేస్తూ నాణ్యమైన విద్యను అందించడంలో కళాశాల కృషిని , సిబ్బందిని ప్రశంసించారు.

MOST READ : 

మరిన్ని వార్తలు