గ్రీనరీ పనులను వేగవంతం చేయాలని ఆదేశం

ఆధునీకరణ పై అధికారులకు మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి  పలు సూచనలు

గ్రీనరీ పనులను వేగవంతం చేయాలని ఆదేశం

ఆధునీకరణ పై అధికారులకు మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి  పలు సూచనలు

సూర్యాపేట జులై27 మనసాక్షి

సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సారథ్యం లో అందమైన పట్టణంగా రూపు దిద్దుకుంటున్న సూర్యాపేట పట్టణం లో సుందరీ కరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.. ఈ మేరకు పట్టణంలో ని మెడికల్ కాలేజ్, సద్దుల చెరువు మినీ టాంక్ బండ్ వద్ద జరిగిన , జరుగాల్సిన పనులను మంత్రి జగదీష్ రెడ్డి అధికారులతో కలిసి పర్యవేక్షించారు.

 

ఇప్పటికే గ్రీనరీ తో పూర్తైన ఐ లవ్ సూర్యాపేట, తెలంగాణా వంటి గ్రీనరీ బోర్డ్ లు సెల్ఫీ పాయింట్లు గా మారిపోయాయి. టాంక్ బండ్ నుండి హైవే వరకు చెరువు కట్ట పొడవునా దిగువన ఏర్పాటు చేసిన రక రకాల పూల మొక్కలు వాహనదారులను కనువిందు చేస్తున్నాయి.

 

ALSO READ :

  1. TSRTC : ప్రయాణికులకు ఆర్టీసీ మరో శుభవార్త .. రూ. 50కే రోజంతా ప్రయాణం..!
  2. Telangana : తెలంగాణలో రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవులు..!
  3. Telangana : సారూ.. ఏవీ..? ఆ.. రూ.10 వేలు..?

 

దాదాపు పట్టణంలో రెండు గంటల పాటు పర్యటించిన మంత్రి, ఎన్టీఆర్ చౌరస్తా, జనగాం క్రాస్ రోడ్స్ లో ఆధునికరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. పచ్చదనం ఉట్టిపడేలా చౌరస్తాలను తీర్చిదిద్దాలని ఆదేశించారు. గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో స్వల్పంగా దెబ్బతిన్న ఎన్టీఆర్ పార్క్ వద్ద గల రహదారులను వెంటనే మరమ్మత్తు చేయాలని అధికారులు సూచించారు.

 

మెడికల్ కాలేజీ హాస్టల్ విద్యార్థుల కోసం, వారికి ఇబ్బందులు తలెత్తకుండా మరో గేటును ఏర్పాటు చేయాలని సూచించారు. సాధ్యమైనంత తొందరగా నాణ్యతతో కూడిన గ్రీనరీ పనులను పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. సూర్యాపేట ను దేశంలోనే నెంబర్ వన్ పట్టణంగా తీర్చిదిద్దడానికి జరుగుతున్న యజ్ఞంలో అధికారులకు తోడుగా ప్రజలు కూడా భాగస్వామి అందించాలని మంత్రి జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు.

 

ALSO READ :

  1. GOOGLE : మీరు ఇలా చేయకుంటే Google త్వరలో మీ Gmail , YouTube ఖాతాలను తొలగిస్తుంది..!
  2. TSRTC : నిరుద్యోగుల గుడ్ న్యూస్ : టిఎస్ ఆర్టీసీలో ఐటిఐ దరఖాస్తులకు ఆహ్వానం..!
  3. Social media : సోషల్ మీడియా యాక్టివ్ యూజర్స్ 500 కోట్లు.. జనాభాలో 60 శాతంకు పైగానే..!