భద్రాద్రి జిల్లాలో గుప్త నిధుల కలకలం

భద్రాద్రి జిల్లాలో గుప్త నిధుల కలకలం

పినపాక. మన సాక్షి

మండలంలోని తోగ్గూడెం పంచాయతీ గోపాలరావుపేట గ్రామంలో పూర్వం యాదవ రాజులు ఈ ప్రాంతంలో నివసించినట్లు పూర్వికులు చెప్పేవారు. గ్రామం నుండి ఒక కిలోమీటర్ సమీపంలో చుట్టు కట్టలా ఉంటుంది. దానితో అక్కడ కొన్ని కొన్ని రాతి శిల్పాలు కూడా ఆ కోటకు సమీపంలో ఇప్పటికి కూడా దర్శనం ఇస్తాయి.

 

ఈ ఆనవళ్ళతో పూర్వికులు రాజులు నివసించినట్లు దానికి దాని పేరు ధనాలకోటగా పిలిచేవారు అని పూర్వికులు చెబుతుండేవారు .

 

గుప్తనిధుల వేటగాళ్లు గురువారం నిమ్మకాయలు మూడు రంగుల దారం, మేకులు, కొబ్బరికాయలతో మంత్రగాళ్ల సహాయంతో మంత్ర తంత్రాలతో బంధం ఏర్పాటు చేసి పెద్ద పెద్ద గొయ్యిలు తీసి ఒక కలశం చెంబు లాంటి కుండ పాత్ర, పెద్ద పాత్ర ముక్కలు ఉండటం తో రెండు లంకె బిందెలు తీసుకెళ్లినట్లు చుట్టుపక్కల రైతులు చెబుతున్నారు.

 

ప్రతి సంవత్సరం ఈ వర్షాకాలంలో ఆదివారం గురువారం ఇటువైపు రావాలంటే రైతులు భయభ్రాంతులకు గురికావలసి వస్తుందని తెలిపారు.

 

♦️ఎక్కువ మంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు లిఫ్ట్ చేయండి..👇

1. TSRTC : ప్రైవేట్ ట్రావెల్స్ కు దీటుగా తెలంగాణ ఆర్టీసీ టూర్ ప్యాకేజీ.. 22 నుంచి ప్రారంభం..!

2. WhatsApp Tips : మీ వాట్సాప్ లో మెసేజ్ మీకు తెలియకుండా ఎవరైనా చదువుతున్నారా..? తెలుసుకోండి ఇలా..!

3. SBI : ఎస్ బీ ఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. హోమ్ లోన్ తీసుకునే వారికి మరింత ఊరట..!