గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థినీలకు అస్వస్థత… వాంతులు, విరోచనాలు

గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థినీలకు అస్వస్థత… వాంతులు, విరోచనాలు

తుంగతుర్తి , మన సాక్షి

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలోని విద్యార్థినీలకు సోమవారం అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న విద్యార్థినిలను పాఠశాలలో ఏ ఎన్ ఎం లేకపోవడంతో ఒక టీచర్ సాయంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు.

 

ఈ మేరకు డాక్టర్ మమత విద్యార్థులను పరిశీలించి చికిత్స నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీలు మాట్లాడుతూ… తమకు రెండు రోజులుగా కడుపులో నొప్పి, జ్వరం, విరోచనాలతో బాధపడుతున్నామని, తగ్గకపోవడంతో ఆసుపత్రికి వచ్చినట్లు తెలిపారు. డాక్టర్ మమత మాట్లాడుతూ..

 

ALSO READ :

1. వేములపల్లి : ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తి అరెస్టు, రిమాండ్..!

2. GOOGLE : మీరు ఇలా చేయకుంటే Google త్వరలో మీ Gmail , YouTube ఖాతాలను తొలగిస్తుంది..!

3. Forest : అడవుల నుంచి బయటికి పరుగులు పెడుతున్న జింకలు.. (వీడియో చూడండి)

 

పాఠశాలలకు చెందిన సుమారు 15 మంది విద్యార్థినీలు జ్వరం, విరోచనాలకు గురైనట్లు నీళ్లు, ఆహారం వల్ల అస్వస్థతకు గురైనట్లు పేర్కొన్నారు. పిల్లలకు సరైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు.

 

కనీసం రెండు రోజులుగా అస్వస్థత గురవుతుంటే పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్ పట్టించుకోవడంలేదని, తమ తల్లిదండ్రులకు సమాచారం కూడా ఇవ్వలేదని విద్యార్థినీలు వాపోయారు.

 

ఇప్పటికైనా ప్రిన్సిపాల్ నిర్లక్ష్య ధోరణి వీడి పిల్లలకు నాణ్యమైన భోజనంతోపాటు మినరల్ వాటర్ ను అందించాలని గురుకుల పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. పేద గిరిజన విద్యార్థినిల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.