వచ్చే నెల నుండి కొత్త పెన్షన్ డబ్బులు

వచ్చే నెల నుండి కొత్త పెన్షన్ డబ్బులు

దుబ్బాక, ఆగస్టు, (మనసాక్షి ) : తెలంగాణ రాష్ట్రంలో తప్ప బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ ఇతర రాష్ట్రాల్లో రూ.2016 పెన్షన్ ఇవ్వడం లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. చితాలు వద్దు అని బీజేపీ ప్రభుత్వం అనుచిత వ్యా్ఖ్యలు చేస్తోందని అలాంటి ప్రభుత్వాన్ని గద్దెదించాలని ప్రజలకు సూచించారు.మంగళవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామంచలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ
వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్ డబ్బులు విడుదల చేస్తామన్నారు.

డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న పథకాలు అమలు కావడం లేదని అన్నారు. ఓ వైపు పేదలకు కేసీఆర్ సంక్షేమ పథకాలు అందిస్తుంటే వాటిని ఉచితాల పేరుతో అడ్డు చెబుతున్న బీజేపీ పెద్ద పెద్ద కంపెనీలకు రుణాలు మాఫీ చేస్తోందని అన్నారు. బీజేపీ వచ్చాక పెట్రోల్, డీజిల్,గ్యాస్ అన్ని ధరలు పెరిగాయని ధరలు పెంచోటోల్లు ఎవరు? ఉచితంగా పేదలకు పంచేటోల్లు ఏవరో మీరే ఆలోచన చేయాలని ప్రజలను కోరారు. బీజేపి ప్రభుత్వం ఆదాయం రెట్టింపు చేయలేదు కానీ ఖర్చు రెట్టింపు చేసిందన్నారు.

ఉచితాల పేరుతో రాష్ట్రాలను భయపెడుతున్న కేంద్రం బావి వద్ద మాత్రం మీటర్లు పెట్టాలని షరతులు విధిస్తోందని చెప్పారు.