పారిశుద్ధ కార్మికులకు హెల్త్ కార్డుల పంపిణీ

పారిశుద్ధ కార్మికులకు హెల్త్ కార్డుల పంపిణీ

హత్నూర,మన సాక్షి:

సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హోప్ న్యూరో హాస్పటల్ సహకారంతో రెండవ విడతలో భాగంగా మెదక్ జిల్లా హత్నూర మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులకు ఉచితంగా హెల్త్ కార్డులను పంపిణీ చేశామని స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు బి.వి.శివ శంకర్ రావు ఒక ప్రకటనలో తెలిపాడు.

 

ఆయన మాట్లాడుతూ మొదటి విడతలో అందని పారిశుద్ధ కార్మికులకు సోమవారం హత్నూర గ్రామంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం దగ్గర హెల్త్ కార్డులను అందజేశామన్నారు. హెల్త్ కార్డు వల్ల ఖర్చులలో 50% సబ్సిడి న్యూరో హాస్పిటల్ లో లభిస్తుందని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

 

🟢 ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి..👇

1. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి అదిరిపోయే సర్వీసులు..!

2. Lands : ఆ భూములకు కూడా రైతు బంధు.. వారికి కూడా రైతు బీమా..!

3. Telangana : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు.. 2858 పోస్టులు..!

4. Dharani : ధరణి పోర్టల్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

 

గత కొన్ని సంవత్సరాలుగా సుమారు 7500 మందికి సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సహాయ సహకారాలు అందించామన్నారు. మునుముందు కూడా నర్సాపూర్ నియోజకవర్గస్థాయిలో విస్తరింప చేయడానికి కృషి చేస్తామన్నారు.

 

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ఆకుల మల్లేష్, నల్లోల్ల మొగులయ్య, మహమ్మద్ సాబీర్, మన్నె దశరథ తో పాటు వివిధ గ్రామ పంచాయతీల పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.