Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : నల్గొండ జిల్లాలో భారీ వర్షం.. నీట మునిగిన వరి పొలాలు, ఉదృతంగా ప్రవహిస్తున్న వాగు..! 

Miryalaguda : నల్గొండ జిల్లాలో భారీ వర్షం.. నీట మునిగిన వరి పొలాలు, ఉదృతంగా ప్రవహిస్తున్న వాగు..! 

నల్లగొండ, మన సాక్షి:

నల్లగొండ జిల్లాలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది.  దాంతో వాగులు వంకలు నిండి పొంగిపొర్లుతున్నాయి. ఇప్పుడిప్పుడే వేసిన వరి నాట్లు నీట మునిగిపోయాయి. వాగులు పొంగడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వేములపల్లి మండలంలో రాత్రి ఆయా గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండలంలోని ప్రధాన గ్రామాలైన ఆమనగల్, లక్ష్మీదేవిగూడెం, రావులపెంట, మొలకపట్నం, సల్కూనూర్ తదితర గ్రామాల్లో రైతుల పొలాలు నీట మునిగాయి.

నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో నీట మునిగిన పంట పొలాలు

రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మూసీ నదిలో వరద ప్రభావం ఉదృతంగా ప్రవహిస్తుంది.ఆయా గ్రామాల చెరువులు నిండుకుండలా మారాయి. లక్ష్మీదేవిగూడెం సమీపంలోనే వాగు పరవాళ్ళు తొక్కుతుంది. మత్స్యకారులు చేపల వేట జోరుగా కొనసాగిస్తున్నారు. దీంతో రాకపోకలకు కొంతమేర అంతరాయం ఏర్పడింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

వర్షాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి:

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వేములపల్లి ఎస్ఐ డి.వెంకటేశ్వర్లు సూచించారు. శిథిలావస్థ భవనాలు, చెట్ల కింద నివాసం ఉండవద్దన్నారు. ఉదృతంగా ప్రవహించే నీటిలో ప్రజలు, మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దన్నారు. వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని కోరారు. రైతులు విద్యుత్ స్తంభాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

MOST READ : 

  1. TG News : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. విద్యా సంస్థలకు సెలవు, ఐటి ఉద్యోగులకు ఇంటి నుంచే పని, వారికి మాత్రం సెలవులు రద్దు..!

  2. Nalgonda : ఉదృతంగా మూసీ నది.. భీమారం కాజ్వే వద్ద పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!

  3. TG News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. కొత్తగా 10 మార్కెట్ యార్డులు.. ఎక్కడెక్కడంటే..!

  4. District collector : ఎరువుల విక్రయాల్లో జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. సహకార సంఘం ఆకస్మిక తనిఖీ..!

  5. District collector : కొడుకు తిండి పెట్టడం లేదని జిల్లా కలెక్టర్ కు వృద్ధురాలు ఫిర్యాదు.. స్పందించిన జిల్లా కలెక్టర్ ఏం చేసిందంటే..!

మరిన్ని వార్తలు