Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

చరిత్రను వక్రీకరిస్తే ప్రజలు క్షమించరు

చరిత్రను వక్రీకరిస్తే ప్రజలు క్షమించరు

సిపిఐ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు పళ్ళ నరసింహారెడ్డి

చింతపల్లి, మన సాక్షి :

నైజాం క్రూరత్వాన్ని, దొరల భూస్వాముల నిరంకుత్వాన్ని ఆగడాలను ఎదిరించి పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను మతోన్మాదులు వక్రీకరించి మతం రంగు పూయడం సిగ్గుమాలిన చర్యని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పళ్ళ నరసింహారెడ్డి. మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరి రావులు అన్నారు.

బుధవారం చింతపల్లి మండలం పరిధిలోని గడియ గౌరారం గ్రామంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ఉజ్జిని నారాయణరావు, స్మారక స్థూపానికి వింజమూరు గ్రామంలో ఆరె కంటి రాములు,ఆరికంటి మైసయ్య,యాచారం రామస్వామి, స్మారక స్థూపాలకు పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను, వీరుల త్యాగాలను నేటి తరానికి తెలియచేయాలని ఉద్దేశంతో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 11 నుండి 17 వరకు సిపి ఐజెండా, ఆవిష్కరణలు, జాతా అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమాన్ని సిపిఐ చేపట్టిందన్నారు.

 

అందులో భాగంగానే వీరుల త్యాగాలను స్మరించుకోవడం జరుగుతుందన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా నిరుపేదలకు పంచి 3000 గ్రామాలను నిజాం కబంధ హస్తాల నుండి విముక్తి చేయడం జరిగిందన్నారు.

ఈ పోరాటంలో భారత కమ్యూనిస్టు పార్టీ వీరులు నాలుగున్నర వేలమంది అమరులయ్యారని వారు పేర్కొన్నారు. రావి నారాయణరెడ్డి, బద్దంఎల్లారెడ్డి, ముగ్ధం మొయినుద్దీన్, ఆధ్వర్యంలో సాగిన సాయుధ పోరాట చరిత్ర సువర్ణ అక్షరాలతో లిఖించ దగిందన్నారు.

నైజాం ప్రభు ముస్లిం అయినప్పటికీ ఆయన కింద పనిచేసే దొరలు పెత్తందారులు, భూస్వాములు, రజాకార్లు, హిందువులేనన్నారు. భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం ఈ పోరాటం మతానికి సంబంధం లేని విషయం అన్నారు. మతోన్మాదులు తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర ను వక్రీకరిస్తూ మతం రంగు పులు మ ట వారి దుర్మార్గమైన చర్యలకు నిదర్శనం అన్నారు.

తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్ 17న అధికారకంగా నిర్వహిస్తామన్న కేసీఆర్ మతఛాందవాసులకు తలోగ్గి తెలంగాణ విలీన వేడుకలను నిర్వహించడానికి నిరాకరిస్తున్నాడని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో నయా దోపిడీ వ్యవస్థ అంతానికి, మతతత్వానికి, వ్యతిరేకంగా, రాజకీయ పరిరక్షణకు సామాజిక న్యాయసాధనకు సమరసిల పోరాటాలు నిర్వహించాలన్నారు.

ALSO READ : 

  1. Vinayaka Statues : ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు మించి ఆకర్షవంతంగా.. మట్టి వినాయక విగ్రహాలు తయారీ..!
  2. Crime News : దొంగతనాలకు పాల్పడుతున్న ట్రాన్స్ జెండర్స్.. చాకచక్యంగా పట్టుకున్న చౌటుప్పల్ పోలీసులు..!
  3. Phonepe, Gpay, Paytm : ఫోన్ పే, గూగుల్ పే, పేటియమ్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారా.. అయితే ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..!
  4. Degree : డిగ్రీ విద్యార్థులకు ఆ కోర్సు తప్పనిసరి.. ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి..!
  5. WhatsApp : వాట్సాప్ సరి కొత్త ఫీచర్.. ఇక ఆ భయం అవసరమే లేదు..!

ఈ సందర్భంగా ఆమరణ స్తూపాల వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆశ సాధనలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామవత్ అంజయ్య నాయక్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తూము బుచ్చిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు వెంకటరమణ, సిపిఐ మండల కార్యదర్శి పోలే వెంకటయ్య,

కనకాచారి, విజేందర్ రెడ్డి, జిల్లా నాయకులు సుదర్శన్ రెడ్డి, సీనియర్ జిల్లా నాయకులు యుగంధర్ రావు, సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఆరకంటి రాధాకృష్ణ, ఏఐటీయూసీ నాయకులు వెంకటేశ్వర్లు, శేఖర్ ఆచారి, ఏఐఎస్ఎఫ్ నాయకులు వినయ్ శ్రీకాంత్, మండల కమిటీ సభ్యులు నరసింహ బుచ్చయ్య, వీరయ్య, శ్రీశైలం, రామకృష్ణ శంకర్లక్ష్మయ్య, పాపయ్య సైదులు, జితేంద్ర దశరథ, రాములు లాలయ్య, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు