District Collector : ఆరోగ్యం ఎలా ఉంది.. వారిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్..!
District Collector : ఆరోగ్యం ఎలా ఉంది.. వారిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్..!
నారాయణపేట టౌన్, మన సాక్షి :
నారాయణపేట మండలం అప్పక్ పల్లి వద్ద గల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో మంగళ వారం జరిగిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమానికి వెళ్లిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం వచ్చిన గర్భిణీల ను ఆప్యాయంగా పలకరించి ఆరోగ్యం ఎలా ఉందని వారిని అడిగి తెలుసుకున్నారు.
గర్భిణిలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని, వైద్యుల సలహాలు, సూచనలు తప్పక పాటించాలని ఆమె వారికి సూచించారు. ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన ఓ శిశువు ను చూసిన కలెక్టర్ ఆ శిశువు తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు.
ఆస్పత్రిలో తాగునీటి సమస్య ఉందని జిల్లా ఆసుపత్రి ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ కిషన్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా స్పందించిన ఆమె మిషన్ భగీరథ ఈ ఈ తో ఫోన్ లో మాట్లాడి మిషన్ భగీరథ ప్రత్యేక పైప్ లైన్ ను ఆస్పత్రికి ఇవ్వాలని ఆదేశించారు.
అలాగే ఆస్పత్రి ఆవరణలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను కూడా ఏర్పాటు చేసే విధంగా చూడాలని రోగుల బంధువులు కలెక్టర్ ను అడగగా డీ అర్ డీ ఏ అధికారులను ఆదేశిస్తామని జిల్లా కలెక్టర్ బదులిచ్చారు.









