PDS RICE : మిర్యాలగూడలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత…!

మిర్యాలగూడ పట్టణంలోని బంగారు గడ్డ కాలనీలో అక్రమంగా నిలవ చేసిన పిడిఎఫ్ బియ్యాన్ని మంగళవారం టూ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

PDS RICE : మిర్యాలగూడలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత…!

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

మిర్యాలగూడ పట్టణంలోని బంగారు గడ్డ కాలనీలో అక్రమంగా నిలవ చేసిన పిడిఎఫ్ బియ్యాన్ని మంగళవారం టూ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సీఐ నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం…షేక్ అమన్, మాదినేని నాగార్జున రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇంట్లో నిలవ చేశారు.విశ్వసనీయ సమాచారం మేరకు ఆకస్మికంగా తనిఖీ చేయగా 28 బస్తాల్లో సుమారు 11 క్వింటాల 20 కేజీల రేషన్ బియ్యాన్ని పట్టుబడినట్టు తెలిపారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.

ఇది కూడా చదవండి : 

OU : ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం.. విద్యార్థి నాయకుల అరెస్ట్..! 

BREAKING: మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ విస్తృత తనిఖీలు.. ఉద్యోగుల పై ఆగ్రహం..!