ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

వేములపల్లి,మన సాక్షి:

మహనీయుల త్యాగాలు మరువలేనివని రావులపెంట గ్రామ సర్పంచ్ దొంతిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.మండల కేంద్రంలోని రావులపెంట గ్రామపంచాయతీ కార్యాలయంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గాంధీజీ,అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు.అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు.

 

ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ….స్వాతంత్రం ఉద్యమ పోరాటంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు గాంధీతో పాటు ఎంతోమంది ప్రముఖ ఉద్యమ నాయకులు కృషి చేశారని గుర్తు చేశారు.బ్రిటిష్ పాలకుల నిరంకుశ పాలన నుండి భారతదేశానికి విముక్తి లభించడానికి జరిగిన స్వాతంత్రోద్యమ పోరాటం ఎంత గొప్పదని,స్వాతంత్రం ఉద్యమ అమరులు త్యాగాలు మరువలేనివని కొనియాడారు.

 

ALSO READ : 

  1. Syber Crime : సైబర్ నేరస్తుల డీప్ ఫేక్ మాయాజాలం.. ఫోటోలు, వీడియోలు గొంతును క్షణాల్లో మార్చేస్తారు..! ఇలా జాగ్రత్తలు పాటించాలి..!
  2. TSRTC : ఒక్క క్లిక్ తో.. మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం..!
  3. TSRTC : తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో స్వాతంత్ర దినోత్సవ ఆఫర్.. టి – 24 టికెట్..!

 

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ జెండాను పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు మాలి జగన్మోహన్ ఎగురవేశారు. ఈనెల 30వ తారీఖున పదవ తరగతి విద్యార్థులకు పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయాలని సర్పంచ్ వెంకట్ రెడ్డి ఆదేశించారు.అనంతరం క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు.

 

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తరి సైదులు, పంచాయతీ కార్యదర్శి రాంరెడ్డి, వార్డు మెంబర్లు శీలం సైదులు, సంజీవ చారి,చీమల వెంకన్న,రెవెల్లి ఈసాక్,నాగేశ్వరరావు,కందుల నాగిరెడ్డి,మరి ఆనందం,శాస్త్రి,పిట్టల జానయ్య,పురాణపు సైదులు, వల్లపుదాసు అజయ్,శీలం బద్రి, సతీష్,కత్తుల సైదులు,సతీష్, ఉపాధ్యాయులు మరియు గ్రామ పెద్దలు,విద్యార్థులు పాల్గొన్నారు.