క్రైంBreaking Newsరంగారెడ్డి

Suicide : ఇందిరమ్మ ఇల్లు రాలేదని వ్యక్తి ఆత్మహత్య..!

Suicide : ఇందిరమ్మ ఇల్లు రాలేదని వ్యక్తి ఆత్మహత్య..!

చింతపల్లి, మన సాక్షి :

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు రాలేదని రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపినవరాల ప్రకారం యాచారం మండల పరిధిలోని చింతపట్ల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన దొడ్డి అశోక్ (44) ఇటీవల ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

అయితే మొదటి విడతలో ఇల్లు మంజూరు అయింది ఇల్లు కట్టుకోవడానికి ఇంటి జాగా లేకపోవడంతో నిబంధన ల ప్రకారం అతని పేరును లిస్ట్ నుండి తొలగించారు. అతని బంధువులను ఇల్లు జాగా ఇవ్వాలని కోరిన ఎవరు ఇవ్వకపోవడంతో స్థానిక నాయకులే తన పేరును తీసివేయించారని తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మృతుడు అశోక్ ఇందిరమ్మ ఇల్లు రాలేదనే కారణంతోనే తాను చనిపోతున్నట్లు చేతి పైన రాసుకున్నాడు. ఈ సంఘటన విషయం తెలుసుకున్న గ్రామస్తులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు మృతదేహాన్ని గ్రామపంచాయతీ ముందు ఉంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు.

దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనితో వెంటనే యాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ మృతుని బంధువులు అలాగే ఆందోళన కొనసాగించారు.

MOST READ : 

  1. Subsidy Seeds : రైతులకు సబ్సిడీపై విత్తనాలు.. సద్వినియోపర్చుకోవాలి..!

  2. Civils Rank : స్మార్ట్ ఫోన్ ముట్టుకోకుండా సివిల్స్ లో ర్యాంక్ సాధించిన శివాని.. RTC ఎండీ స‌జ్జ‌న‌ర్ సన్మానం..!

  3. UPI : గూగుల్ పే, ఫోన్ పే లావాదేవీల్లో కొత్త రూల్స్ వచ్చేశాయి.. పేమెంట్స్ ఫెయిల్ అయితే..!

  4. BaBa Vanga : 2025 లో ఏం జరగబోతోంది.. బాబా వంగా చెప్పిన భవిష్యవాణి ఏంటి.. తీవ్ర ఆందోళన..!

  5. TG News : రైతులకు శుభవార్త.. వారి ఖాతాలలో డబ్బులు జమ..!

మరిన్ని వార్తలు