Breaking Newsక్రైంజాతీయంతెలంగాణహైదరాబాద్
బిగ్ బ్రేకింగ్ : హైదరాబాదులో ఐటి సోదాలు..!
బిగ్ బ్రేకింగ్ : హైదరాబాదులో ఐటి సోదాలు
హైదరాబాద్, మనసాక్షి :
హైదరాబాదులో ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. కళామందిర్, కాంచీపురం వరమహాలక్ష్మి వస్త్ర వ్యాపారాలకు సంబంధించిన షోరూమ్స్ వారి ఓనర్స్ ల ఇండ్లలో సుమారు 40 బృందాలుగా విడిపోయి హోదాలు చేపడుతున్నారు.
సిటీలోని దిల్ సుఖ్ నగర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాలలో పలుచోట్ల ఐటి సోదాలు చేపడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో కూడా కళామందిర్ షోరూమ్ లలో తనిఖీలు చేస్తున్నారు. 20 ప్రాంతాలలో హోదాలు జరుగుతున్నాయి.
గత మూడు సంవత్సరాల నుంచి షోరూమ్ లలో ఎంత వ్యాపారం జరిగింది. దిగుమతి ఎంత చేసుకున్నారు. విక్రయాలు ఏ విధంగా చేపట్టారు. ఇన్కమ్ టాక్స్ ఎంత చెల్లించారు. అనే విషయంపై సోదాలు చేస్తూ వివరాలు తీసుకుంటున్నట్లు తెలిసింది. కళామందిర్ డైరెక్టర్, ఎండి ఇళ్లలో కూడా సోదాలు చేపడుతున్నారు.









