మెరుగైన వైద్య సేవలకు కేరాఫ్ ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

మెరుగైన వైద్య సేవలకు కేరాఫ్ ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

మెదడు, వెన్నెముక, గుండె ఎముకుల వైద్య నిపుణులచే హాస్పటల్ నిర్వహణ

అనుభవజ్ఞులైన వైద్యులచే 24 గంటల వైద్య సేవలు

అత్యాధునిక యంత్ర పరికరాలు… అందించనున్న వైద్య సేవలు.

నల్గొండ, మన సాక్షి : నల్గొండ జిల్లా కేంద్రంలో కొత్తగా ప్రముఖ అనుభవ వైద్య నిపుణులు, మెదడు వెన్నెముక శాస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ శశాంక కోడె నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఐకాన్ సూపర్ స్పెషాలిటీ మెరుగైన వైద్య సేవలకు కేరాఫ్ గా మారిందని పలువురు పేర్కొంటున్నారు. నలగొండ పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ వెనుక శ్రీ కృష్ణ టెంపుల్ పక్కన, ఆర్టీసీ కాలనీ విద్యానగర్ వద్ద అనుభవజ్ఞులైన వైద్యులచే మెదడు, వెన్నెముక, గుండె ఎముకల 24 గంటల నిరంతర వైద్య సేవలను అందిస్తూ రోగుల మన్నెనలు పొందుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఆస్పత్రి నందు అత్యాధునిక ఎంత పరికరాలతో వైద్య పరీక్షలు ఆపరేషన్లు నిర్వహించే విధంగా ఏర్పాటు చేశారు. వెన్నుముక మెదడు సర్జరీలు, 24/7 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ ద్వారా వైద్య సేవలు, 24/7 యాంజియా గ్రామ్, స్టంట్, ఫేస్ మేకర్ ఆపరేషన్లు, ఫెరిఫెరల్, యాంజియా ప్లాస్టి ఆపరేషన్లు చేయబడుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఐకాన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై డాక్టర్ శశాంక కోడె “మన సాక్షి”తో మాట్లాడుతూ గుండె నొప్పి, గుండెపోటు, చాతిలో బరువు, గుండె దడ, ఆయాసం, కాళ్ల వాపులు, చిన్నపిల్లల గుండె సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్, మూతి వంకర, పక్షవాతం, స్పృహ కోల్పోవడం, మూర్ఛ, మెడ నొప్పి, నడుము నొప్పి, తలకు గాయాలు, ట్రామాటల ఫ్యాక్చర్ మేనేజ్మెంట్, సాధారణ మోకాళ్ళ మార్పిడి జాయింట్ రీప్లేస్మెంట్ ఎముకలు, కీళ్లు, కండరాల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అర్ధ రైటిస్, క్రీడల గాయాలు, తదితర సేవలు తమ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అందించడం జరుగుతుందని ఆయన వివరించారు.

24 గంటలు మెరుగైన వైద్య సేవలతో పాటు వైద్యులు అందుబాటులో ఉంటారని సేవలను నల్గొండ జిల్లావాసులుఉపయోగించుకోవాలని ఆయన కోరారు.