Nalgonda : జగదీష్ రెడ్డిని గొల్లగూడ ఆస్పత్రిలో చేర్పించాలి..!

Nalgonda : జగదీష్ రెడ్డిని గొల్లగూడ ఆస్పత్రిలో చేర్పించాలి..!
నల్లగొండ, మన సాక్షి :
అధికారం కోల్పోయిన తర్వాత భీఆర్ఎస్ చెంచాలు సోయి లేకుండా మాట్లాడుతున్నారని డిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డితో కలిసి బిఆర్ఎస్ బాకీ కార్డుల పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పై ఘాటుగా విమర్శించారు.
10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బిఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి చేయకుండా ప్రాజెక్టుల పేరుతో పేదల సొమ్మును దోచుకుతుందని విమర్శించారు.
పేద ప్రజలకు గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని అన్నారు.
ఎస్సీలకు మూడెకరాల భూమిని పంపిణీ చేస్తామని చెప్పి బాకీ పడిందని ఎద్దేవ చేశారు. అదేవిధంగా
రైతులకు రుణమాఫీ ఐదు సంవత్సరాల వడ్డీ బాకీ,
నిరుద్యోగులకు నెలకు రూ.3000 బాకి పడిందన్నారు.
ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల బాకీ పడిందన్నారు.
వీటన్నింటినీ విస్తరించి ప్రజలను మోసం చేసిందని అన్నారు.బిఆర్ఎస్ హయంలో మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న జగదీష్ రెడ్డిని గొల్లగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటనే అడ్మిట్ చేయాలన్నారు. తిప్పర్తిలో ఆరు గ్యారెంటీలపై విడుదల చేసిన కార్డుపై నల్లగొండ సెంటర్లో చర్చకు రావాలని సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక 24 వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ దేనిని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శించే స్థాయి మీకు, మీ చెంచాలకు లేదని అన్నారు.
నల్లగొండ అభివృద్ధి పథంలో ముందుకు పోతుందని స్పష్టం చేశారు. అన్ని ప్రాజెక్టులను పెండింగ్ పెట్టిన ఘనత మీ కెసిఆర్ దని ఎద్దేవ చేశారు. ఏనాడు కేసీఆర్ అసెంబ్లీలో చర్చకు రాకుండా ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నాడని తెలిపారు. కాలేశ్వరం పేరు మీద లక్షల కోట్లు దోచుకున్నది వాస్తవమ కాదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీదని పేర్కొన్నారు.
మీరు ధర్నా చౌకులు ఎత్తేస్తే తిరిగి ధర్నా చౌక్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి సూర్యాపేటలో గెలిచిన ఒక్క సీటు కూడా రాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తూ ముందుకెళుతుందని చెప్పారు. కొన్ని గ్యారెంటీలు అమలు కాకపోవటం టిఆర్ఎస్ చేసిన అప్పులే ముఖ్య కారణమని అన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ప్రాజెక్టు పనులు వేగవంతం అయ్యాయని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని పేర్కొన్నారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమపడ్డ కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లక్ష మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనుఫ్ రెడ్డి, నరేష్ పురం దేవాలయ కమిటీ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ షబ్బీర్ బాబా, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గా అధ్యక్షుడు మామిడి కార్తీక్, పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, కొప్పు నవీన్ గౌడ్, పిల్లి యాదగిరి యాదవ్, కిన్నెర అంజి, పెరికే చిట్టి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Elections : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఎన్నికల తేదీలు ఇవే..!
-
Curd : ఏ సమయంలో పెరుగు తింటున్నారు.. ఏం జరుగుతుందో తెలుసా..!
-
KLI : తెగిపోయిన కేఎల్ఐ కాలువ.. వృధాగా పోతున్న నీరు..!
-
District collector : కలెక్టర్ హెచ్చరిక.. ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..!
-
Curd : ఏ సమయంలో పెరుగు తింటున్నారు.. ఏం జరుగుతుందో తెలుసా..!









