Jeevan Reddy : జీవన్ రెడ్డికి మంత్రి పదవి.. ఏఐసీసీ బంపర్ ఆఫర్..?

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ని పార్టీలో చేర్చుకోవడం పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి పై ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్న జీవన్ రెడ్డికి ఏఐసీసీ బంపర్ ఆఫర్ ఇచ్చిందని సమాచారం.

Jeevan Reddy : జీవన్ రెడ్డికి మంత్రి పదవి.. ఏఐసీసీ బంపర్ ఆఫర్..?

మన సాక్షి :

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ని పార్టీలో చేర్చుకోవడం పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి పై ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్న జీవన్ రెడ్డికి ఏఐసీసీ బంపర్ ఆఫర్ ఇచ్చిందని సమాచారం. జీవన్ రెడ్డి అలక భూని పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే ఆలోచనలో పడ్డారు. దాంతో జగిత్యాల నియోజకవర్గంతో పాటు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా పలువురు కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనకు మద్దతు తెలిపారు. దాంతో ఆయన రాజీనామా ఆలోచన చేశారు.

జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు గాను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఆయన నివాసానికి వెళ్ళినట్లు సమాచారం. కాగా వారితో మాట్లాడిన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ దీపా దాస్ మున్షి కూడా జీవన్ రెడ్డి తో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయొద్దని ఏఐసీసీ కోరినట్లు తెలిసింది. ఆయనకు మంత్రి పదవి ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.

నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన తనకు తన ప్రత్యర్థి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ని పార్టీలో చేర్చుకునే సమయంలో తనతో కనీసం చర్చ కూడా జరపకుండా రేవంత్ రెడ్డి పార్టీలో చేర్చుకున్నారని జీవన్ రెడ్డి ఫైర్ అయినట్లు సమాచారం. కాగా జీవన్ రెడ్డిని ఏఐసీసీ బుజ్జగించి ఆయనకు మంత్రి పదవి ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది.

ALSO READ : 

Oil palm cultivation : ఆయిల్ పామ్ తోటల సాగుతో అధిక ఆదాయం.. 80 నుంచి 100 శాతం ప్రభుత్వం రాయితీ..!

Mahalakshmi: ప్రతి మహిళకు నెలకు ₹2500 ఎప్పటినుంచంటే.. మీరు అర్హులేనా..?

POSTAL: పోస్టల్ శాఖలో 50వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్, రాత పరీక్ష లేకుండా ఎంపిక..!