వైభవం.. జోగినాథ రథోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు..!

వేలాది మంది భక్తులు తరలి రాగా.. జోగిపేట పట్టణం శివనామస్మరణతో మారుమోగింది. జోగిపేటలోని శ్రీ జోగినాథ రథో త్సవాల్లో భాగంగా గురువారం అర్ధరాత్రి రంగు రంగుల విద్యుత్ దీపాలు, దేవతామూర్తుల విగ్రహాలతో అందంగా అలంకరించడిన శ్రీజోగినాథ రథం ముందుకు కదిలింది.

వైభవం.. జోగినాథ రథోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు..!

అందోలు, మనసాక్షి :

వేలాది మంది భక్తులు తరలి రాగా.. జోగిపేట పట్టణం శివనామస్మరణతో మారుమోగింది. జోగిపేటలోని శ్రీ జోగినాథ రథో త్సవాల్లో భాగంగా గురువారం అర్ధరాత్రి రంగు రంగుల విద్యుత్ దీపాలు, దేవతామూర్తుల విగ్రహాలతో అందంగా అలంకరించడిన శ్రీజోగినాథ రథం ముందుకు కదిలింది.

గౌని చౌరస్తా వద్ద రథం ఎదుట భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. రథం ముందు క్వింటాలు బియ్యంతో వండిన అన్నాన్ని రతిపోయడం ఆనవాయితి. వడ్ల, కమ్మరి, చాకలి, మంగళి కులాలకు చెందిన వారు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం రథానికి ఆలయ పూజారులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు. ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది రాత్రి 10 గంటల నుంచే వేలాది మంది భక్తులు రథయాత్రను తిలకించేందుకు తరలిరావడం విశేషం. జోగిపేట చుట్టు పక్క ప్రాంతాలకు చెందిన భక్తులు రథంను అనుసరించారు.

గౌని చౌరస్తా నుంచి ప్రారంభమైన రథయాత్ర శ్రీ జోగినాథ దేవాలయం వద్దకు శుక్రవారం తెల్లవారు జామున వరకు చేరింది.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సురేందర్ గౌడ్, చిట్టిబాబు, శివశంకర్, రంగ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

Aadhaar : మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటో మీకు నచ్చలేదా..? అయితే ఇలా మార్చేయండి..!

Whatsapp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఇక మీ ఫ్రెండ్స్ స్టేటస్ పెట్టగానే..!

Komatireddy : మూడు నెలలలో బిఆర్ఎస్ ఆఫీస్ పునాదులు లేకుండా చేస్తాం… కోమటిరెడ్డి అంటే ఏంటో చూయిస్తా..!