Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్క్రైంజిల్లా వార్తలుతెలంగాణ

Karimnagar : కరీంనగర్ లో పెను ప్రమాదం.. టీజీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం..!

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు శివారులో ఆదివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) కి చెందిన ఒక (జేబీఎం) ఎలక్ట్రిక్ బస్సులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.

Karimnagar : కరీంనగర్ లో పెను ప్రమాదం.. టీజీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం..!

కరీంనగర్, మనసాక్షి :

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు శివారులో ఆదివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) కి చెందిన ఒక (జేబీఎం) ఎలక్ట్రిక్ బస్సులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బస్సు కరీంనగర్ నుండి హైదరాబాద్‌కు 41 మంది ప్రయాణికులతో బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం సంభవించింది.

సమయస్ఫూర్తితో ప్రాణాలు కాపాడిన డ్రైవర్.. బస్సు అలుగునూరు సమీపంలోకి రాగానే ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. రోడ్డు పక్కన బస్సును ఆపి, ప్రధాన ద్వారంతో పాటు ఎమర్జెన్సీ గేట్లను ఓపెన్ చేసి ప్రయాణికులందరినీ కిందకు దించేశాడు. ప్రయాణికులు కిందకు దిగిన క్షణాల్లోనే బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఉవ్వెత్తున ఎగసిపడి బస్సు మొత్తానికి వ్యాపించాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిబూడిదై కేవలం అస్థిపంజరంలా మిగిలింది. డ్రైవర్ సరైన సమయంలో స్పందించడం వల్ల 41 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో ఒక పెద్ద ప్రమాదం తప్పిందని, దింతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు