Karimnagar : రిసార్ట్ లో యువకుడి అనుమానాస్పద మృతి..!
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం వడ్డేపల్లి శివారులోని ఓ రిసార్ట్ లో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Karimnagar : రిసార్ట్ లో యువకుడి అనుమానాస్పద మృతి..!
కరీంనగర్, మనసాక్షి :
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం వడ్డేపల్లి శివారులోని ఓ రిసార్ట్ లో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా పాలితం గ్రామానికి చెందిన దురిశెట్టి నిఖిల్ (21)అనే యువకుడు తన స్నేహితులతో కలసి బుధవారం అర్థరాత్రి సదరు రిసార్ట్ లో జరిగిన ఒక పార్టీకి హాజరయ్యాడు.
పార్టీ అనంతరం నిఖిల్ ఫామ్‌హౌస్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై మృతుడి తండ్రి దురిశెట్టి సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిఖిల్ స్నేహితులపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు కొత్తపల్లి సీఐ బిల్లా కోటేష్ తెలిపారు.
బుధవారం రాత్రి పార్టీలో ఏం జరిగింది అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని సివిల్ ఆసుపత్రి మార్చురీలో ఉంచామని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ పేర్కొన్నారు.









