Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణ

District collector : డ్రగ్స్ నిర్మూలనకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు..!

District collector : డ్రగ్స్ నిర్మూలనకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు..!

కరీంనగర్, మనసాక్షి :

మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, యువత, విద్యార్థులు మత్తుపదార్థాల బారిన పడకుండా చూడాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జరిగింది.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్, ఎక్సైజ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో మాదకద్రవ్యాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు జిల్లాలో సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. పోలీస్, ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో డ్రగ్స్ మూలాలను పెకిలించి వేయాలని పేర్కొన్నారు.

జిల్లాలోని 221 పాఠశాలల్లో, 70 వసతి గృహాలు, ఇనిస్టిట్యూషన్లో మత్తుపదార్థాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి 26వేల 700 మంది విద్యార్థులకు అవగాహన కల్పించామని తెలిపారు. మిగిలిన పాఠశాలలు, హాస్టళ్లు, కళాశాలలను సందర్శించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

షీ టీమ్ లను కూడా అవగాహనలో భాగస్వామ్యం చేయాలన్నారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ పోలీసు శాఖ తరఫున గత 7 నెలల్లో 75 కార్యక్రమాలు నిర్వహించి 6550 మంది విద్యార్థులకు మత్తు పదార్థాల అనర్థాలపై అవగాహన కల్పించామని తెలిపారు.

డాగ్ స్క్వాడ్ ద్వారా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. 11 ప్రదేశాల్లో అకస్మాత్తుగా తనిఖీలు చేశామని, 31.360 కేజీల గంజాయిని సీజ్ చేశామని తెలిపారు. 16 కేసులు నమోదు చేసి 39 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. 390 డ్రగ్ డిడక్షన్ కిట్లను తెప్పించామని తెలిపారు. మాదక ద్రవ్యాలు వినియోగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ పుల్లయ్య, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబు, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, విద్యాశాఖ కోఆర్డినేటర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. ACB : రూ.70 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చెక్కిన సబ్ రిజిస్ట్రార్.. డాక్యుమెంట్ రైటర్..!

  2. Dmart : డి మార్ట్ లో అతి తక్కువ చౌక ధరలకు సరుకులు కావాలా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!

  3. Tasildar : తహశీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన రామకృష్ణారెడ్డి ఎవరో తెలుసా..!

  4. Govt Scheme : ఆ రైతులకు అదిరిపోయే స్కీం.. ఎకరానికి రూ.9600 రాయితీ..!

  5. District collector : భూ భారతి పై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ఆ సమస్యలు ఆర్డీవో పరిధిలోనే పరిష్కారం..!

మరిన్ని వార్తలు