కొండపోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే యాదయ్య..!

శంకర్‌పల్లి మునిసిపల్ పరిధి లోని చిన్న శంకర్‌పల్లి వార్డులో గల గొల్ల కేతమ్మ, భ్రమరాంబ మల్లికార్జున స్వామి, కొండపోచమ్మ అమ్మవార్లను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

కొండపోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే యాదయ్య..!

శంకర్‌పల్లి: జనవరి 02: (మన సాక్షి):

శంకర్‌పల్లి మునిసిపల్ పరిధి లోని చిన్న శంకర్‌పల్లి వార్డులో గల గొల్ల కేతమ్మ, భ్రమరాంబ మల్లికార్జున స్వామి, కొండపోచమ్మ అమ్మవార్లను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, వైస్ చైర్మన్ వెంకట్రాం రెడ్డి, పిఎసీయస్ చైర్మన్ శశిధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాపారావు, బీఆర్ఎస్ మున్సిపల్, మండల నాయకులు పాల్గొన్నారు.

ALSO READ : Upi Rules : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు అలర్ట్.. కొత్త సంవత్సరం నుంచి మారిన రూల్స్ .. చూడండి..!