మిర్యాలగూడ : మంత్రి కేటీఆర్ కు ఎమ్మెల్యే భాస్కర్ రావు వినతి

మిర్యాలగూడ : మంత్రి కేటీఆర్ కు ఎమ్మెల్యే భాస్కర్ రావు వినతి

మిర్యాలగూడ, మనసాక్షి:

మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధికి సహాకరించాలని మున్సిపల్, ఐటీ శాఖా మంత్రి తారక రామారావు ని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు శుక్రవారం అసెంబ్లీ లాబీ లో కలిసి విన్నవించారు. మిర్యాలగూడ మునిసిపాలటీ, నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్ కు ఎమ్మెల్యే భాస్కర్ రావు వివరించారు.

 

మిర్యాలగూడ మునిసిపాలటీ పరిధిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, లబ్ధిదారుల ఎంపిక దాదాపుగా పూర్తయిందని, పట్టణంలోని ప్రధాన రహదారుల విస్తరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రధాన కూడళ్లు, సెంట్రల్ లైటింగ్, వంటి పలు పనులు చేపట్టవలసి ఉందని, ఎన్ హెచ్ -165, అద్దంకి- నార్కట్ పల్లి రహదారి లింకేజీ పనులు పెద్ద యెత్తున్న చేపట్ట వలిసిన ఉందని, పలు అభివృద్ధి పనులు మునిసిపల్ మంత్రి తారక రామారావు దృష్టికి ఎమ్మెల్యే భాస్కర్ రావు తీసుకవచ్చారు.

 

నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే భాస్కర్ రావు కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారు.

 

ALSO READ : 

  1. Runa Mafi : రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది..? తెలుసుకుందాం..!
  2. UGC : ఆ యూనివర్సిటీలు ఫేక్.. ఆ డిగ్రీలు చెల్లవు..!
  3. PhonePe : ఫోన్ పే గుడ్ న్యూస్.. కేవలం రూ.49 తో రూ. లక్ష..!
  4. Vande Bharath : తెలంగాణకు మరో వందేభారత్.. ఏడు గంటల్లోనే గమ్యం..!
  5. TS TET NOTIFICATION : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల..!