Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లారాజకీయం

Narayanpet : భూ నిర్వాసితుల కోసం కాళ్లు మొక్కుతా..!

Narayanpet : భూ నిర్వాసితుల కోసం కాళ్లు మొక్కుతా..!

నారాయణపేట టౌన్, మన సాక్షి :

మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న భూనిర్వాసితులకు న్యాయమైన పరిహారం కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కాళ్లు మొక్కుతా నని కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి అన్నారు.

ఆదివారం జిల్లా కేంద్రంలో శ్రీలక్ష్మి బాంక్విట్ ఫంక్షన్ హాల్ లో భూ నిర్వాసితుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.రైతుకు భూమికి మధ్య ఉన్న సంబంధం విడదీయలేనిదని వెలకట్టలేని బంధం ఉన్నదని భూ నిర్వాసితులకు తప్పకుండా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

భూ నిర్వాసితులకు పరిహారం పెంచాలని గతంలో ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకొని పోవడం జరిగిందని మళ్లీ రైతుల కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోతానని వారి సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు.

ఊట్కూర్, జాజాపూర్ , పెరపల్ల కానుకూర్తి గ్రామాల చెరువులు నింపి ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందిస్తామని అన్నారు.ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజల కల జీవో నెంబర్ 69 ప్రకారం నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకము అన్నారు. అయితే కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం నేడు అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశంలోతెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్ , భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర నాయకులు వెంకోబా, మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు నర్శింహ,,ప్రశాంత్ భూ నిర్వాసితుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ధర్మరాజు గౌడ్ సిఐటియు జిల్లా కార్యదర్శి బలరాం నిర్వాసితుల సంఘం నాయకులు కానుకుర్తి భీంరెడ్డి, శెట్టి రమేష్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య గౌడ్ రైతు సంఘం నాయకులు మహేష్ కుమార్ గౌడ్, కానుకుర్తి భూ నిర్వాసితుల సంఘం కాట్రేపల్లి గ్రామ నాయకులు,కేశవులు పాల్గొన్నారు.

MOST READ :

  1. Shankarpalli : శంకర్‌పల్లి పట్టణానికి పేరు ఎలా వచ్చిందో తెలుసా..!

  2. TG News : రేషన్ కార్డుదారులకు శుభవార్త.. సెప్టెంబర్ నుంచి సన్న బియ్యం అలా పంపిణీ..!

  3. Big Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన.. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్..!

  4. TG News : తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. ఆగస్టు 22 లోపే..!

మరిన్ని వార్తలు