బావ మరిది హత్య కేసులో బావకు జీవిత ఖైదు..!

బావమరిదిని హత్య చేసినందుకు బావకు జీవిత ఖైదు జరిమానా ను జిల్లా జడ్జి నాగరాజు విధించినట్లు తెలిపారు.

బావ మరిది హత్య కేసులో బావకు జీవిత ఖైదు..!

నల్లగొండ, మన సాక్షి:

బావమరిదిని హత్య చేసినందుకు బావకు జీవిత ఖైదు జరిమానా ను జిల్లా జడ్జి నాగరాజు విధించినట్లు తెలిపారు. ఎస్పీ తెలియజేసిన వివరాల ప్రకారం.. పీఏ పల్లి మండలం మేడారం గ్రామానికి చెందిన అంజయ్య ను అతని బావ సీతా ముత్యాలు గొడ్డలితో హత్య చేసినట్లు తెలిపారు.

నిందితుడు సీత ముత్యాలు భార్య తోగొడవ పడడంతో భార్య తల్లిగారి ఇంటి వద్ద ఉంటుందని దీనికి కారణం తన బావమరిది అంజయ్య, మామ మారయ్యలు కారణమని కక్ష పెంచుకొని గొర్రెల షెడ్డు ముందు నిద్రిస్తున్న అంజయ్య ను హత్య చేసిండని ఎస్పీ తెలిపారు.

ALSO READ : Recruitment : ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాలు.. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చింది అందుకేనా..!

మృతిని తండ్రి మారయ్య ఫిర్యాదు మేరకు గుడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి సరైన ఆధారాలు కోర్టుకు అందజేయడంతో నిందితునికి జీవిత ఖైదు జరిమానాదించారని ,  జరిమానా చెల్లించ పక్షంలో మరో నాలుగు నెలల పాటు జైలు శిక్ష వేసినట్లు తెలిపారు. కేసులు సరియైన ఆధారాలు స్వీకరించి నిందితునికి శిక్ష పడే విధంగా చేసిన అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు శివరామిరెడ్డి .రంజిత్ రెడ్డి. గుడిపల్లి ఎస్సై సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

ALSO READ : Good News : నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త.. త్వరలో 15 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్…!