లిటిల్ ఫ్లవర్ : యోగా గ్రాండ్ ప్రదర్శన
లిటిల్ ఫ్లవర్ : యోగా గ్రాండ్ ప్రదర్శన
మిర్యాలగూడ, మన సాక్షి:
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ లోని
స్థానిక హౌసింగ్ బోర్డు లోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ వారు సుమారు 150 మంది పిల్లల తో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల అవరణలో యోగా గ్రాండ్ ప్రదర్శనను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎం.ఎల్.సి, అడ్వకేట్ కోటిరెడ్డి ముఖ్య అతిధి గా పాల్గొని ఇటువంటి కార్యక్రమాల వలన పిల్లల్లో శారీరక, మానసిక వత్తిడి తగ్గించి, చదువు పట్ల మరియు ఇతర విషయాల పట్ల ఆసక్తిని పెంచుకుంటారు. ఆలోచన శక్తి కూడా పెరుగుతదని చెప్పారు. యోగా భారత సనాతన సంప్రదాయం అని, దానిని తర తరాలకు అందించాలనీ, ఇట్టి బృహత్తర మైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పాఠశాల యాజమాన్యాన్ని, యోగా శిక్షకుడు టి. వినోద్ చంద్రన్ ని అభినందించారు. పాఠశాల సిలబస్ లో కూడా యోగా ను ఒక పాఠ్యాంశంగా చేర్చి, పిల్లలకు అనుదినం శిక్షణ ఇవ్వాలని అందుకు ప్రభుత్వ పరంగా కూడా చర్యలు చేపట్టడానికి ముందడుగు వేస్తామని చెప్పారు.
మండల విద్యా అధికారి ఎం.బాలాజీ నాయక్ కూడా అతిథి గా పాల్గొని ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు స్కూల్ యాజమాన్యాన్ని మరియు స్కూల్ సిబ్బందిని అభినందించారు. యోగా అనాది కాలం నుండి భారత దేశం లో ప్రజ్వరిల్లుతుంది. ఇటువంటి ప్రక్రియ ను పిల్లలకు నేర్పి, అభ్యసింప చెయ్యడం చాలా సంతోష కరమైన విషయమని పేర్కొన్నారు.
వార్డు కౌన్సిలర్ డి. రవి నాయక్ పాల్గొని అందరినీ అభినందించారు. స్థానిక ప్రజా వైద్యులు, సోషల్ ఆర్గనైజర్ ఎం.డి. మునీర్ పాల్గొని ఈ రకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, పిల్లల చదువు పట్ల నే కాకుండా వారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధాసక్తులు చూపించే స్కూల్ నిర్వాహకులను, సిబ్బందిని అభినందించారు.
అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. కె. జయరాజన్ ఉపన్యసిస్తూ మా స్కూల్ లో పిల్లలకు 1వ తరగతి నుండియే ఈ యోగా అభ్యసన లో మరియు రోజూ సాధన చెయ్యడం లో బాగా తర్ఫీదు ను ఇచ్చి, మంచి భావి భారత పౌరులుగా తయారు చేసి, చదువులో మరియు రేపు పెద్దయ్యాక అన్ని వ్యవస్థలలో అన్ని రకాల వత్తిడులను జయించే విధంగా తీర్చి దిద్దుతున్నామన్నారు.
ప్రదర్శన లో ఇతర అధికార , అనధికార ప్రముఖులు, పలు సంఘాల నాయకులు, తల్లి దండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గూడపూరి లక్ష్మణ్. పరంగి రాము , రవి నాయక్ , ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయులు వేంకటేశ్వర్లు పాల్గొని యోగా వలన వచ్చే లబ్దిని పిల్లలకు సవివరంగా వివరించారు. స్కూల్ సిబ్బంది అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.












