నల్గొండ : లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ మృతి, పలువురికి గాయాలు..!

నల్గొండ జిల్లాలో లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన సంఘటనలో డ్రైవర్ మృతి చెందగా పలువురు గాయాలయ్యాయి. వివరాలు ప్రకారం.. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద హైదరాబాద్ - విజయవాడ 65 వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

నల్గొండ : లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ మృతి, పలువురికి గాయాలు..!

నల్గొండ , మన సాక్షి:

నల్గొండ జిల్లాలో లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన సంఘటనలో డ్రైవర్ మృతి చెందగా పలువురు గాయాలయ్యాయి. వివరాలు ప్రకారం.. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద హైదరాబాద్ – విజయవాడ 65 వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఆర్టిసి బస్సు ఢీ కొట్టింది. బి హెచ్ ఈ ఎల్ డిపోకు చెందిన ఈ ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ మృతిచెందగా పదిమందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు.

ALSO READ : మాడుగులపల్లి : రైలు పట్టాల మధ్య ఇరుక్కుపోయిన ట్రాక్టర్.. పల్నాడు ఎక్స్ ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం