Madgulapally : కళ్ళల్లో కారం చల్లి మెడలో గొలుసుతో పరార్.. నిందితుని గుర్తింపు..!
వృద్ధురాలి మెడలో గోల్డ్ అనుకొని రోల్డ్ గోల్డ్ చైను లాకెళ్లిన ఘటన బుధవారం రాత్రి మండలంలోని ఇసుకబాయిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది

Madgulapally : కళ్ళల్లో కారం చల్లి మెడలో గొలుసుతో పరార్.. నిందితుని గుర్తింపు..!
మాడుగులపల్లి, మన సాక్షి :
వృద్ధురాలి మెడలో గోల్డ్ అనుకొని రోల్డ్ గోల్డ్ చైను లాకెళ్లిన ఘటన బుధవారం రాత్రి మండలంలోని ఇసుకబాయిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నిమ్మల లక్ష్మమ్మ (ఒంటరి మహిళ) తన ఇంటి ఆరుబయట నిద్రిస్తుండగా మధ్య రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆమె కండ్లపై కారం చల్లి, నోరు మూసి ఆ మెడలో గల రెండు వరుసల గుండ్లు గుండ్లు గల రోల్డ్ గోల్డ్ గోల్డ్ చైన్ అనుకోని లాక్కొని పోయినాడు.
ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసున మాడుగుల పల్లి పోలీసులు ఈరోజు నమ్మదగిన సమాచారం మేరకు ఫిర్యాదురాలు చెప్పిన ఆనవాళ్ళతో అదే గ్రామానికి చెందిన గోలి రాజశేఖర్ పట్టుబడి చేయగా, అతడు తన నేరాన్ని ఒప్పుకున్నందున అతని నుండి రోల్డ్ గోల్డ్ చైను ని రికవరీ చేసి నిందితున్ని జ్యుడీషియల్ రిమాండ్కు తరలించనైనది.
బాధితురాలు వృద్ధురాలు మరియు ఒంటరి మహిళ అయినప్పటికీ కూడా ధైర్యంతో చాలా తెలివిగా తన గోల్డ్ చైన్ ని దాచి రోల్డ్ గోల్డ్ చైను ధరించి, నేరస్తునితో ప్రతిఘటించకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి ఎలాంటి ప్రాణ నష్టo కాని ఆస్తి నష్టఓ జరగకుండా కాపాడుకున్న ఆమె తెలివికి పోలీసులు మరియు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎండాకాలం కావున ఆరు బయట నిద్రించేవారు మరియు ఒంటరి మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏమైనా సంఘటనలు జరిగిన వెంటనే డయాల్ -100 కు లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలని చేయాలని కోరుచున్నాము.









