Telangana : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి 

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.

Telangana : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి 

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నట్లు ఉత్తర్వులలో వెల్లడించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులన్నీ రద్దయిన విషయం తెలిసిందే.

గతంలో బీ ఆర్ ఎస్ ప్రభుత్వంలో మీడియా అకాడమీ చైర్మన్ గా కొనసాగిన అల్లం నారాయణ పదవి కూడా రద్దయింది. కాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నూతనంగా మీడియా అకాడమీ చైర్మన్ గా శ్రీనివాసరెడ్డిని నియమించింది. శ్రీనివాస్ రెడ్డి నల్లగొండ జిల్లా వాసి. ఆయన నియామకం పట్ల పలువురు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ : Nalgonda : యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి..!