Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మిల్లర్ల కొర్రీలు.. తక్కువ ధరకు ధాన్యం కొనుగోళ్లు..!

Miryalaguda : మిల్లర్ల కొర్రీలు.. తక్కువ ధరకు ధాన్యం కొనుగోళ్లు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

ఇటీవల కురిసిన మొంథా తుఫాన్ వల్ల వరి ధాన్యం దెబ్బతినగా మిల్లర్లు కొర్రీలు పెట్టి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయంపై సిపిఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ కు వినతిపత్రం అందజేశారు.

మండలంలోని యాద్గార్ పల్లి గ్రామంలో సూర్య రైస్ మిల్లు వద్ద సబ్ కలెక్టర్ పరిశీలిస్తుండగా రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు, జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా కనకయ్య ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ను కలిసి సమస్యలు విన్నవించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుఫాను వల్ల వందల ఎకరాలు నేలపాలైందన్నారు. కోత మిషన్లు దొరకకపోవడం వల్ల రైతులు నానా ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఎకరానికి 25 బస్తాల ధాన్యం దిగుమతి వస్తుందని, అంతేకాకుండా తుఫాను వల్ల ధాన్యం కాటిక వచ్చాయన్నారు. దాంతో మిల్లర్లు కొర్రీలు పెట్టి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని వారు పేర్కొన్నారు.

గ్రామాలలో తుఫాన్ వల్ల నష్టపోయిన రైతుల వివరాలను వ్యవసాయ అధికారులు ఇప్పటి వరకు సేకరించలేదని తెలిపారు. వ్యవసాయ అధికారులు గ్రామాలలో పంట నష్టపోయిన రైతుల వివరాలను సేకరించాలని, తడిసిన ధాన్యంకు మద్దతు ధర చెల్లించి మిల్లర్లు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

వినతి పత్రం అందజేసిన వారిలో రైతు సంఘం నాయకులు పచ్చిపాల లింగయ్య, ఆశీర్వాదం, ఉపేందర్, బాలకృష్ణ, సతీష్, వెంకటయ్య, మట్టయ్య, రవీందర్, నాగు నాయక్, వెంకన్న, శివలింగం, రాములు, యాదగిరి, విశ్వనాథ్ తదితరులు ఉన్నారు.

MOST READ: 

  1. Double Bedrooms : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల బిల్లులు ఇవ్వాలని లబ్ధిదారులు రాస్తారోకో..!

  2. Nalgonda : విజయవాడ హైవే పై మరో బస్సు దగ్ధం..!

  3. Fee : పరీక్ష ఫీజు పేరుతో అక్రమ వసూళ్లు.. డీఈఓ ఆదేశాలు బేఖాతర్..!

  4. VISA : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి షాక్.. యూఎస్ వీసా మరింత కఠినం..!

మరిన్ని వార్తలు