Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మైనర్ బాలిక అత్యాచారం కేసులో సంచలన తీర్పు..! 

Miryalaguda : మైనర్ బాలిక అత్యాచారం కేసులో సంచలన తీర్పు..! 

అడవిదేవులపల్లి, మన సాక్షి:

మైనర్ బాలికపై అత్యాచార కేసులో వ్యక్తికి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడిన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని అడవిదేవులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ వి.శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం..

15 ఏప్రిల్ 2017 రాత్రి 8 గంటల సమయంలో అడవిదేవులపల్లి మండల కేంద్రానికి చెందిన వీరంశెట్టి సాంబశివ రావు అడవిదేవులపల్లి గామానికే చెందిన 17 సంవత్సరాల వయస్సు గల మైనర్ బాలికపై అత్యాచారం చేయగా, అదే రోజున బాధితురాలి తల్లి ఇచ్చిన దరఖాస్తుపై అప్పటి ఎస్ఐ జె. శివకుమార్ సి ఆర్ నెంబర్ 4/2017, యు సెక్షన్ 376(2),
(ఎం) ఐపిసి సెక్షన్ 3,4 ఆఫ్ పోక్ షో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయగా, అప్పటి సి.ఐ జె.రవీంధర్ నల్గొండ ఫోక్ షో కోర్ట్ చార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది.

ఇట్టి కేసులో కోర్ట్ (23) మంది సాక్షులను విచారించన అనంతరం మంగళవారం నేరస్తుడు వీరంశెట్టి సాంబశివ రావుకు 20 సంవత్సరాలు జైలు శిక్ష, బాధితురాలికి నష్టపరిహారంగా 25,000/- రూపాయలు చెల్లించాలని తీర్పు ఇవ్వడం జరిగింది.

ఇట్టి కేసులో దర్యాప్తుకు సహకరించిన అప్పటి ఎస్ఐ జె. శివకుమార్,సిఐ జె.రవీందర్, ప్రస్తుత ఎస్ఐ వి.శేఖర్,సి.ఐ పి ఎన్ డి.ప్రసాద్, లైజన్ ఆఫీసర్ మల్లిఖార్జున్, నరేందర్, కోర్ట్ కానిస్టేబుల్ బి.సత్యనారాయణ, పిపి రంజిత్ కుమార్ లను డి.ఎస్.పి అభినందించారు.

MOST READ : 

  1. Health Tips : వర్షాకాలంలో ఆ కూరగాయలు తినేటప్పుడు జాగ్రత్త.. ఏం చేయాలి..!

  2. Rythu Bima : 18 ఏళ్లు నిండిన వారికి ఐదు లక్షల బీమా.. రెండు రోజులే గడువు.. కావలసిన పత్రాలు ఇవీ..!

  3. Blood Group : మీకు ఆ బ్లడ్ గ్రూప్ ఉంటే స్ట్రోక్ ప్రమాదం ఎక్కువ.. అధ్యయనంలో నిర్ధారణ..!

  4. TGSRTC : తెలంగాణ ఆర్టీసీ భారీ గుడ్ న్యూస్.. వారందరికి టికెట్లపై రాయితీ..!

  5. TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై ఆర్టీసి కీలక ప్రకటన.. అలా చేస్తేనే ఫ్రీ టికెట్..!

మరిన్ని వార్తలు