Miryalaguda : మిర్యాలగూడలో కాంగ్రెస్ ప్రచారం..!

ఈరోజు 15వ వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గ ఎం ఎల్ ఏ బత్తుల లక్ష్మారెడ్డి పిలుపు మేరకు నల్గొండ జిల్లా పార్లమెంట్ అభ్యర్థి కుందూ రఘువీర్ రెడ్డి విజయాన్ని అభ్యర్థిస్తూ కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకి అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ 15వ వార్డు కౌన్సిలర్ మంత్రాల రుణాల్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారం చేశారు.

మిర్యాలగూడ, మన సాక్షి:

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలా విధంగా నే రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 5 సూత్రాల సంక్షేమ పథకాలను వార్డు ప్రజలకు తెలుపుతూ ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యరెడ్ల వెంకట్ రెడ్డి, జానపాటి రవి, బొప్పిడి సతీష్ రెడ్డి, ఆర్లపూడి శీను, నక్క శేఖర్ మరియు తదితరులు పాల్గొన్నారు.