Miryalaguda : మురుగు కాలువలు పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని 25 వ వార్డు కృష్ణ కాలనీలో మురుగు కాలువలను కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం పరిశీలించారు.

Miryalaguda : మురుగు కాలువలు పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని 25 వ వార్డు కృష్ణ కాలనీలో మురుగు కాలువలను కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం పరిశీలించారు. కృష్ణ కాలనీ బైపాస్ రోడ్ పక్కన మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక చెరువును తలపిస్తున్న వ్యర్ధ జలాలు , చెత్తాచెదారం తో కూడిన వ్యర్ధాలు భరించలేని దుర్వాసనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

25 వ వార్డు కాంగ్రెస్ ఇంచార్జ్ గోదాల జానకిరామ్ రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ కి సమాచారం ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి తక్షణమే వచ్చి పరిసరాలను పరిశీలించారు. రెండు రోజుల్లో డ్రైనేజీ వ్యవస్థను సరిచేయాలని మున్సిపాలిటీ వారికి సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండాది శంకర్, శ్రీనివాస్, జాన్ రెడ్డి పాల్గొన్నారు.

ALSO READ : Miryalaguda : రైతులను ఇబ్బంది పెడుతున్న ఆ రైస్ మిల్లు సీజ్ చేయండి.. కోమటిరెడ్డి ఆదేశం..!