Miryalaguda : ధాన్యం కొనుగోలు చేయని మిల్లులపై చర్యలు

ధాన్యం కొనుగోలు చేయని మిల్లులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు. సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ మిల్లర్స్ తో సమావేశం నిర్వహించారు.

Miryalaguda : ధాన్యం కొనుగోలు చేయని మిల్లులపై చర్యలు

మిర్యాలగూడ, మన సాక్షి :

ధాన్యం కొనుగోలు చేయని మిల్లులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు. సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ మిల్లర్స్ తో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడలో 87 మిల్లులకు గాను 65 మిల్లులు మాత్రమే ధాన్యము కొనుగోలు చేస్తున్నాయన్నారు. రైతుల నుండి వచ్చిన ధాన్యము కొనుగోలు మొదలు పెట్టని మిల్లులు వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని, లేని పక్షాన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు.

డీఎస్ఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతులకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, వచ్చిన ట్రాక్టర్ వచ్చినట్టుగానే శాంపిల్ వెరిఫై చేసి వెంటనే పంపించాలని, రైతుల ధాన్యానికి సరి అయిన రేటుని అందించాలని ఆదేశించినారు. రైస్ మిల్లులో పనిచేసే వారు మిల్లర్లు రైతులతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని సరియైన సమాధానం చెప్పాలని ఆదేశించినారు.

శాంపిల్ వెరిఫై చేసే వారు తాలున్నదని , తేమ లేదని రకరకాల సాగులు చెబుతూ ధాన్యం రేటు ని తగ్గించవద్దని ఆదేశించినారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఆర్డీవో శ్రీనివాసరావు సివిల్ సప్లై జిల్లామేనేజర్ నాగేశ్వరరావు , మిర్యాలగూడ , వేమనపల్లి , త్రిపురారం ఎమ్మార్వో, జేడీ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్, సివిల్ సప్లై డిటి సిఎస్ షేక్ జావిద్ , సివిల్ సప్లై ఆర్ఐ సురేందర్ సింగ్, విల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ , ప్రెసిడెంట్ శ్రీనివాసులు, జనరల్ సెక్రెటరీ బాబి, మిల్లర్స్ పాల్గొన్నారు.

రైతులకు ఇబ్బంది కలగకుండా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు సివిల్ సప్లై, అగ్రికల్చర్ , మార్కెటింగ్ శాఖ, మిల్లర్స్ అసోసియేషన్ అన్ని శాఖల సమయాన్నిమయంతో ఒక టీం ను ఏర్పాటు చేయడమైనది.

ALSO READ :

Liquor scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటివరకు అరెస్టులు ఎన్నో తెలిస్తే షాక్..!

Telangana : మీ కరెంట్ బిల్లు జీరో రాలేదా..? అయితే ఇలా చేయండి..!

పెళ్లయిన ఏడాదిలోపే.. రాత్రి 10 గంటలకు బైక్ పై వెళుతుండగా..!

Reporters Arrest : విలేకరుల బ్లాక్ మెయిల్.. కుటుంబం ఆత్మహత్య.. ఇద్దరు అరెస్టు, పరారీలో ముగ్గురు..!

మిర్యాలగూడ : కాలం చెల్లిన బిస్కెట్ ప్యాకెట్ల విక్రయం.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం..!