Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
రాజకీయంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

Devarakonda : కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో విద్యారంగానికి పెద్దపీట.. ఎమ్మెల్యే బాలు నాయక్..!

Devarakonda : కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో విద్యారంగానికి పెద్దపీట.. ఎమ్మెల్యే బాలు నాయక్..!

మనసాక్షి, కొండమల్లేపల్లి

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరానికి విద్యారంగానికి పెద్ద పీట వేస్తూ విద్యార్థులకు మేస్ చార్జిలు పెంచి పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని నిరూపించారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం లోని చెన్నారం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు దేవరకొండ శాసనసభ్యులు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ చూపుతూ మేస్ పెంచిందని గుర్తు చేశారు. పది సంవత్సరాలుగా విద్యారంగాన్ని గాలికి వదిలేసి ఇప్పుడేదో చేసినట్టుగా బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తుందని ఆయన మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వ ఆయాంలో పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే వెనుకకు వెళ్లదని ఎంత కష్టమైనా ముందుకు వెళుతుందని అన్నారు. గత పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ప్రభుత్వాన్ని అప్పగిస్తే రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాలు ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం అప్పులలో ఉన్న కూడా రైతులకు రుణమాఫీ చేసి దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నామని అన్ని గ్యారెంటీలను నెరవేరుస్తామని అన్నారు.

బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పై దుష్ప్రచారం చేయడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో గురుకులాలను తప్పుదోవ పట్టించే విధంగా చేస్తున్నారని ప్రభుత్వం పై అనవసరంగా ఆరోపణలు చేస్తే ఎంతటి వారి పైన చర్యలు తీసుకుంటామని అన్నారు. దేవరకొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా తాను అభివృద్ధి చేస్తానని దేవరకొండ నియోజకవర్గం 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి విడతల వారీగా నిరుపేదలకు ఉండేందుకు ఇండ్లు కట్టిస్తామని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సిరాజ్ ఖాన్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటయ్య ఏరుకొండ రాము యువజన కాంగ్రెస్ అధ్యక్షులు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు