BREAKING : బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్ యాదవ్ ను అడ్డుకున్న గిరిజనులు

గిరిజనుల చిరకాల కోరిక మేడిగడ్డ - శంకర్ కొండ కత్వ వాగు పై బ్రిడ్జి నిర్మాణం. ఈ బ్రిడ్జి నిర్మాణం పై బీఆర్ఎస్ ప్రభుత్వం అలసత్వం చేయడంతో గిరిజనులు బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

BREAKING : బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్ యాదవ్ ను అడ్డుకున్న గిరిజనులు

రంగారెడ్డి జిల్లా,ఆమనగల్లు ప్రతినిధి, మనసాక్షి:

గిరిజనుల చిరకాల కోరిక మేడిగడ్డ – శంకర్ కొండ కత్వ వాగు పై బ్రిడ్జి నిర్మాణం. ఈ బ్రిడ్జి నిర్మాణం పై బీఆర్ఎస్ ప్రభుత్వం అలసత్వం చేయడంతో గిరిజనులు బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి ఆమనగల్లు మండలం శంకర్ కొండా తండాకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులకు చుక్కెదురైంది. మేడిగడ్డ కత్వవాగు నిర్మాణంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నిర్లక్ష్యం వహించారని, అలాంటి వారు మళ్ళీ ఎన్నికల సందర్బంగా ఓట్ల కోసం వస్తారా అని ప్రశ్నించడంతో కొద్దిసేపు గందరగోళ వాతావరణం ఏర్పడింది.

ALSO READ : హత్య యత్నం కేసులో నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష..!