MLA : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సైకిల్ యాత్ర..!
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా సైకిల్ యాత్రను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు.

MLA : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సైకిల్ యాత్ర..!
తుర్కపల్లి, మన సాక్షి-
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా సైకిల్ యాత్రను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. శనివారం యాదగిరిగుట్ట నుండి తుర్కపల్లి మండల కేంద్రం వరకు పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా సైకిల్ యాత్రను చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలపై పెరుగుతున్న ఇంధన భారాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తుర్కపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో దాన్యం నిలువలు అధికంగా ఉండటం లారీల సమస్య రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని పరిశీలించారు.
దాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని జూన్ రెండవ తేదీ వరకు ఏ దాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాన్యం కనిపిస్తే అధికారులపై చర్యలు తప్పవని అన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. వెంకటాపురం గ్రామ సమీపంలో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ కు నాలుగు నుండి ఐదు చోట్ల లీకేజీలు ఉన్న విషయాన్ని గుర్తించారు.
వెంటనే మంత్రి సీతక్కతో ఫోన్లో మాట్లాడి సమస్య తీవ్రతను వివరించారు .ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా వృధా అవుతున్న నీటిని అరికట్టేందుకు వెంటనే మరమ్మత్తు పనులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి సీతక్క తక్షణమే అధికారులకు ఆదేశాలు జారీచేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మదర్ డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ధనావత్ శంకర్ నాయక్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు చాడ భాస్కర్ రెడ్డి ,సర్పంచులు జేరిపోతుల కరుణాకర్, కర్రే మాధవి కరుణాకర్ గౌడ్,సోమల్ల వెంకటేశం, గుగులోతు ధూప్సింగు నాయక్ ,భూక్య రాజారాం నాయక్ ,ఉప సర్పంచ్ పల్లె నరేష్ గౌడ్,
నాయకులు దేవరుప్పల ఐలయ్య ,ధనావత్ భాస్కర్ నాయక్, దొమ్మాట బాబు, బానోతు వీరన్న నాయక్ ,బోరెడ్డి మహిపాల్ రెడ్డి,దొనికేన వెంకటేష్ యాదవ్, గడ్డమీది నిఖిల్ గౌడ్, ఎరుకల వెంకటేష్ గౌడ్, బాలు యాదవ్ , కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు , పాల్గొన్నారు..









