భద్రాచలం ఎమ్మెల్యే పై పోలీసులకు ఫిర్యాదు

భద్రాచలం ఎమ్మెల్యే పై పోలీసులకు ఫిర్యాదు

వెంకటాపురం , మన సాక్షి.

ములుగు జిల్లా వెంకటాపురం మండలం మంగళవారం నాడు భద్రాచలం శాసనసభ్యులు పొదెం.వీరయ్య మండల ప్రజలకు ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చలేదని మాయ మాటలు చెప్పి మోసం చేసినందుకు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంప.రాంబాబు స్థానిక పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేశారు.

 

2019 శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి మండల ప్రజలకు ప్రభుత్వ జూనియర్ కాలేజీ, అగ్నిమాపక కేంద్రం, మండల వ్యాప్తంగా ప్రధాన, గ్రామీణ రహదారులను సిమెంటు రహదారులుగా మారుస్తానని హామీ ఇచ్చి గెలిచారని ఇప్పటివరకు ఐదు సంవత్సరాలు కావచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారని ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పటివరకు ఏ ఒక్కటి నెరవేర్చలేదని మోసపూరిత హామీలు ఇచ్చి గెలిచిన వీరయ్య మరోసారి మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నాడని అన్నారు.

 

ALSO READ :

1. CRIME : రెండంతస్తులు చూపించాడు.. రెండున్నర కోట్లకు ముంచాడు..!

2. Eamcet Counseling : తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు.. రిపోర్టు ఎప్పుడు చేయాలో తెలుసుకుందాం..!

3. Ktr : కేటీఆర్ కాన్వాయ్ వెళ్తున్న దారిలోనే రోడ్డు ప్రమాదం.. ఆయన ఏం చేశారో..! ( వీడియో వైరల్)

 

 

ప్రభుత్వం దళితులకు ఇచ్చే దళిత బంధు పథకంలో లక్షల రూపాయల అవినీతికి పాల్పడినట్లు ఎమ్మెల్యే అతని అనుచరులు మండల కాంగ్రెస్ నాయకుల అవినీతిపై విచారణ జరిపించి ప్రజలను మోసగించిన ఎమ్మెల్యే పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

 

ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి పాయం.రమణ, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ చిడెం.యామిని, ఉపాధ్యక్షుడు గాంధర్ల. నాగేశ్వరరావు,సీనియర్ నాయకులు వేల్పూరి. లక్ష్మీనారాయణ,శ్రీదేవి,ఆదిలక్ష్మి మద్దుకూరి.ప్రసాద్,ఎల్లారావు, చిట్టిబాబు,ఏడుకొండలు, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

 

ALSO READ : 

1. Rythu : నెల రోజుల్లో కోటీశ్వరుడైన రైతు.. 20 ఏళ్ల దరిద్రం పోయింది..!

2. Telangana : తెలంగాణ ఎన్నికలకు ముందే ఐడి కార్డు ఉంటే సరిపోదు.. ఓటర్ల జాబితాలో మీ పేరు.. ఉందో? లేదో? ఇలా చూసుకోండి..!