Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

Breaking : రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య గన్ మెన్ మృతి..!

Breaking : రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య గన్ మెన్ మృతి..!

శంకర్‌పల్లి, (మన సాక్షి):

బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య గన్ మెన్ మృతి చెందిన సంఘటన బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకెళితే శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని బుల్కాపూర్ గ్రామానికి చెందిన ముత్తంగి శ్రీనివాస్ (34) సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు మండలం ఎలిమెల గ్రామంలో ఆదివారం బీరప్పల జాతర ఉండటంతో అమ్మమ్మ ఇంటికి వచ్చాడు.

ఆదివారం జాతర ముగించుకొని రాత్రి శంకర్ పల్లి మండలం బుల్కాపూర్ గ్రామానికి వస్తుండగా కొండకల్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు మోకిల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

MOST READ : 

  1. Pedda Gattu : అర్థరాత్రి కేసారం నుంచి పెద్దగట్టుకు చేరిన దేవరపెట్టే..!

  2. Rythu Bharosa : రైతుల ఖాతాలలో భరోసా డబ్బులు.. ఎప్పటినుంటే.. లేటెస్ట్ అప్డేట్

  3. Penpahad : కల్తీ విత్తనాలతో భారీగా నష్టం.. వ్యవసాయ అధికారులకు రైతు ఫిర్యాదు..!

  4. TG News : తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ నిజమేనా.. సీఎంకు ఆ ఎమ్మెల్యే లేఖ..!

మరిన్ని వార్తలు