Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లారాజకీయం

Mlc By Election Polling : క్యాంపు నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి.. కట్టుదిట్టంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్..!

Mlc By Election Polling : క్యాంపు నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి.. కట్టుదిట్టంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్..!

నారాయణపేట, మన సాక్షి

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కు ఓటర్లు క్యాంపు నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. గురువారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న పోలింగ్ కేంద్రానికి మక్తల్ నియోజకవర్గం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఓ ప్రైవేటు వాహనంలో చేరుకున్నారు.

మక్తల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వాహనంలో క్యాంపు నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి చేరుకోగా.. కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలానికి చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధు లు క్యాంప్ నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, చిట్టెం పర్నిక రెడ్డి కూడా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయం ఖాయమని దీని అర్థం చేశారు.

ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి పోలింగ్ సరళిని పరిశీలించారు. మన్నే జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలో 250 నుండి 300 వందల ఓట్లతో గెలవబోతున్నని దిమవ్యక్తం చేశారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణీక రెడ్డి మాట్లాడుతూ మా అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నరని చెప్పారు.మక్తల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలనలో ఎంపిటిసిలు, జెడ్పీటీసీలు నిర్లక్ష్యానికి గురి అయ్యారని చెప్పారు. వారు తమ యొక్క కసిని ఈ ఎన్నికల్లో తీర్చుకొని బదులిస్తారని అన్నారు.

ALSO READ :

KTR : ముఖ్యమంత్రా.. బోటి కొట్టేవాడా, రేవంత్ రెడ్డి పై కేటీఆర్ ఫైర్..!

KTR : యూట్యూబ్ ఛానళ్లకు కేటీఆర్ హెచ్చరిక.. పరువు నష్టంతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం..!

Sand: ఇకపై ఇసుక ఫ్రీ.. వారి అవసరాలకు మాత్రమే..!

Good News : ఇసుక రవాణా పై ప్రభుత్వం గుడ్ న్యూస్..!

మరిన్ని వార్తలు